Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

జమ్మూకశ్మీర్‌కు కేంద్ర అతిపెద్ద ప్యాకేజ్…

Published on Sep 11 2017 // News

జమ్మూకశ్మీర్‌కు కేంద్రం భారీ ప్యాకేజ్ ఇస్తోందని కేంద్ర హోం మంత్రిరాజ్‌నాథ్ సింగ్ సోమవారంనాడు తెలిపారు. రాష్ట్రానికి ప్రధాని డవలప్‌మెంట్ ప్యాకేజీ (పీఎండీపీ) లక్ష కోట్ల రూపాయలు దాటినట్టు ఆయన తెలిపారు.

ఈ ప్యాకేజీ కింద ఇంతవరకూ రూ.62,599 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పీఎండీపీ ప్రాజెక్టు అమలులో ప్రగతిని ఇక్కడ జరిగిన సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు.

ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీపీ వ్యాస్, ఆయన మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు శ్రీనగర్‌లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ ప్రజలకు తాను పూర్తి భరోసా ఇస్తున్నానని, అవసరమైతే ఏడాదిలో 50 సార్లు ఇక్కడకు రమ్మన్నా వస్తానని అన్నారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే తమ ముందున్న లక్ష్యమని రాజ్‌నాథ్ విస్పష్టంగా ప్రకటించారు. కారుణ్యం, కమ్యూనికేషన్, సహజీవనం, విశ్వాసం పాదుకొలపడం, నిలకడైన విధానాల ద్వారానే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. చర్చల ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారం సాధ్యమని ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ స్పష్టం చేసిన విషయాన్ని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కశ్మీర్‌లోయలో పరిస్థితి మెరుగుపడిందని, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే తమ అభిమతమని చెప్పారు. ఆర్టికల్ 35ఏ గురించి హోం మంత్రి ప్రస్తావిస్తూ, జమ్మూకశ్మీర్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలను కేంద్ర తీసుకోదని చెప్పారు.

Leave a comment