Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

పాకిస్తాన్ సంచలన నిర్ణయం..?

Published on Sep 11 2017 // National

ఇటీవల బ్రిక్స్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్‌కు గర్వభంగం కలిగిందా? మిత్రదేశం చైనా కూడా పాకిస్తాన్‌లోని ఉగ్రసంస్థలపై ఉరమడంపై అక్కడి ప్రభుత్వంలో కదలిక వచ్చిందా? అంటే అవుననే అనిపిస్తోంది.

ఆదివారం ఉదయం నుంచి పాకిస్తాన్ పోలీసులు, సైనిక దళాలు మెట్రోనగరం కరాచీలో విస్తృత సోదాలు నిర్వహించాయి. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 53 మందిని అరెస్టు చేశాయి. సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా మరో ఉగ్రవాది హతమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

కరాచీలోని పలు ప్రాంతాల్లో వివిధ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు, నేరగాళ్లు తలదాచుకుంటున్నట్టు నిఘా వర్గాలు సమాచారం అందించాయని కరాచీ ఎస్పీ అదీల్ చాండియో పేర్కొన్నారు.

ఒకప్పుడు డ్రగ్స్ దందాకి నిలయంగా భావించిన లాయరి ప్రాంతంలో విస్తృత దాడులు నిర్వహించి ఏకంగా 50 మందిని అరెస్టు చేయడం గమనార్హం. దరక్షన్ ప్రాంతంలో మరో ముగ్గురిని అరెస్టు చేయగా… చకీవారా ప్రాంతంలో కొందరు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయినట్టు సమాచారం.

ఈ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో ఓ అనుమానిత ఉగ్రవాది హతమయ్యాడు. కరాచీలో ఇటీవల నగరంలో జరుగుతున్న దాడులు, నేరాల్లో పాత్రదారులుగా అనుమానిస్తున్న వారిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

కాగా పాకిస్తాన్‌ను అడ్డాగా చేసుకుని రెచ్చిపోతున్న హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్ తదితర ఉగ్రసంస్థలను ఖండిస్తూ బ్రిక్స్ దేశాలు తమ తీర్మానంలో చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో ‘పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టిల్లు’ అంటూ భారత్ చేస్తున్న ఆరోపణలకు.

అంతర్జాతీయ సమాజం నుంచి బలమైన మద్దతు లభించినట్టైంది. జైషే మహ్మద్ చీఫ్ సయీద్‌ను ఎప్పుడూ వెనకేసుకొచ్చే చైనా సైతం పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. ఇది జరిగిన పదిరోజుల్లోపే పాకిస్తాన్ పోలీసులు, ఆర్మీ కరాచీలో దాడులు జరపడం విశేషం.

Leave a comment