Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

కర్నూలులో షీ టీమ్స్ ముమ్మర దాడులు

Published on Sep 11 2017 // News

11 మంది వ్యభిచార గృహాల నిర్వాహకులు.. ఏజెంట్ల అరెస్టు
పడుపు వృత్తిలో చిక్కుకున్న మరో 10 మంది అమ్మాయిలను బాధితులుగా గుర్తించి ఐసీడీఎస్ కు అప్పగింత
అమ్మాయిల్లో నలుగురు స్తానికులు.. ఇతర రాష్ర్టాలకు చెందిన అమ్మాయిలు ఆరుగురు
ఢిల్లీ.. ముంబై.. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ర్యాగింగ్.. ఈవ్ టీజింగ్.. అమ్మాయిలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్ ను కర్నూలు పోలీసులు కూడా ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. రోడ్లపై సివిల్ దుస్తుల్లో తిరుగుతూ నిఘా పెట్టి అమ్మాయిలు.. మహిళలకు రక్షణగా నిలిచే కార్యక్రమాలు చేపడుతూ రోమియోల భరతం పడుతున్నారు.

అంతే కాదు.. అమాయకులైన అమ్మాయిలను వ్యభిచారం రొంపిలో దింపుతున్న ఉదంతాలు కర్నూలులో కూడా చోటు చేసుకుంటున్నాయని గుర్తించి మెరుపు దాడులు చేయగా 10 మంది అమాయకులైన అమ్మాయిలు పట్టుపడ్డారు. వీరిలో నలురుగురు మైనార్ అమ్మాయిలు కావడం కలకలం రేపింది. వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈవ్ టీజింగ్.. ర్యాగింగ్ ఉదంతాలు.. మరెక్కడికో దారితీస్తున్నాయి. కర్నూలులో అమ్మాయిల భద్రత కోసం ఏర్పాటు చేసిన షి టీమ్స్ జరిపిన దాడుల్లో సంచలనం కలిగించే విషయాలు బయటపడ్డాయి. రోడ్లపై అమ్మాయిలను ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారిని వ్యభిచార గృహాలకు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తేలింది.

ధనార్జనే ధ్యేయేంగా పెట్టుకున్న వ్యబిచార గృహాల నిర్వాహకులు పలువురు ఏజెంట్లను నియమించుకుని అమాయకులైన కాలేజీ విద్యార్ధులు మైనారిటీ తీరని అబ్బాయిలను ఆకర్షిస్తున్నారు.

రోమియోల వలకు చిక్కిన అమ్మాయిలు కనపడితే వారిని డబ్బు సుఖాలు చూపించి పడుపు వృత్తిలోకి దింపుతున్నారు. వ్యభిచార వృత్తితో కోట్లు సంపాదిస్తున్న నిర్వాహకులు ఏకంగా ఇతర రాష్ర్టాల అమ్మాయిలను కూడా ఇక్కడకు తరలించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది.

: షీ టీమ్స్ బృందాలకు చిక్కిన రోమియోలు ఇచ్చిన సమాచారంతో మరింత లోతుగా విచారణ చేపట్టిన పోలీసులకు.. ఆ తీగ వ్యభిచార గృహాలకు దారితీసింది. ఒకేరోజు జరిపిన దాడుల్లో ఏకంగా 21 మంది పట్టుపడ్డారు. ఆరుగురు వ్యభిచార గృహాల నిర్వాహకులు కాగా.. మరో ఐదుగురు వారి ఏజెంట్లున్నారు.

వీరి చేతుల్లో చిక్కి వ్యభిచార వృత్తిలో చిక్కుకున్న 10 మంది అమ్మాయిలను గుర్తించారు. వీరందరూ బాధితులుగా గుర్తించిన పోలీసులు.. నలుగురు మైనారిటీ తీరని అమ్మాయిలతోపాటు.. ఇతర రాష్రాలకు చెందిన మొత్తం మంది మంది అమ్మాయిలను ఐసీడీఎస్ కు అప్పగించారు.

వృభిచార గృహాల నిర్వాహకులను కర్నూలు పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు ఇంకా కొనసాగుతున్నాయని ఓ ఎస్డీ రవిప్రకాష్ తెలిపారు.

Leave a comment