Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

టీడీపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు..?

Published on Sep 11 2017 // Politics

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసింది. అయితే, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని పెట్టుకున్నారు.

రాష్ట్ర విభజన అనంతంర కిరణ్ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన బీజేపీలో చేరుతారని కొన్నిసార్లు, వైసీపీలో చేరుతారని మరి కొన్నిసార్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, తాజాగా ఓ వార్త వెలుగు చూసింది. కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి చేరుతున్నారనేదే ఆ వార్త. ఇప్పటికే టీడీపీ ముఖ్యనేతల ద్వారా నారా లోకేష్ తో కిషోర్ సంప్రదింపులు జరిపారట.

చిత్తూరు జిల్లాలో బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన కిషోర్ టీడీపీలోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందని లోకేష్ కూడా భావిస్తున్నారట.

కిషోర్ ను పార్టీలోకి తీసుకురావడానకి జిల్లాకు చెందిన మంత్రి అమరనాథ రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా రామచంద్రారెడ్డి తదితరులు ఈ విషయమై కిషోర్ తో పలుమార్లు చర్చలు జరిపారట.

ఈ నేపథ్యంలో, తన ముఖ్య అనుచరులతో మంతనాలు సాగించిన కిషోర్… చివరకు టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

త్వరలోనే ఆయన పీలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయాన్ని లాంఛనంగా ప్రకటించనున్నారు.

Leave a comment