Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

పన్నీరు సెల్వంకు ఎయిర్‌పోర్ట్‌లో నిర‌స‌న‌లు

Published on Sep 08 2017 // Politics

అధికార అన్నాడీఎంకేలో రేగిన సంక్షోభం ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీరుసెల్వం చేతులు కలపడంతో సమసిన సంగతి తెలిసిందే.

అయితే ఊహించని ఈ పరిణామంతో దినకరన్, ఆయన మద్దతుదారులు పళని, పన్నీరు వర్గాలపై రగిలిపోతున్నారు. ఆ అసంతృప్తి సెగ పన్నీరు సెల్వం వర్గానికి మధురై ఎయిర్‌పోర్ట్‌లో తగిలింది.

పన్నీరు సెల్వం పెరియాకులం వెళ్లడానికి ఆయన మద్దతుదారులతో కలిసి గురువారం రాత్రి 7.20 నిమిషాలకు మధురై విమానాశ్రయానికి వచ్చారు. పన్నీరు సెల్వం, ఆయన వర్గం కనిపించగానే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న దినకరన్ మద్దతుదారులు వ్యతిరేక నినాదాలు చేశారు.

శశికళకు, దినకరన్‌కు అనుకూలంగా కేకలు వేయడంతో పన్నీరు సెల్వం వర్గం రగిలిపోయింది. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వాగ్వాదంగా మొదలైన ఘర్షణ చివరకు భౌతిక దాడులకు పాల్పడే వరకూ వెళ్లింది.

ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో కొందరు కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో గొడవ సద్దుమణిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు.

Leave a comment