Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

ట్రంప్ నిర్ణ‌యాల‌పై ఒబామా ఆగ్ర‌హం

Published on Sep 06 2017 // NRI

చిన్నప్పుడే తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్‌)ను అక్రమ వలసదారులుగా గుర్తించడాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు

. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్‌ (డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌–డీఏసీఏ) వర్క్‌ పర్మిట్లను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేయడాన్ని క్రూరమైన నిర్ణయంగా ఒబామా అభివర్ణించారు.

డ్రీమర్స్ ఆశలు గల్లంతు చేస్తూ ఫైలుపై ట్రంప్‌ మంగళవారం ఉదయం సంతకం చేయగా, అదేరోజు ట్రంప్ చర్యను ఒబామా తప్పుపట్టారు. డ్రీమర్స్ వర్క్ పర్మిట్లు రద్దు చేయడాన్ని క్రూరమైర నిర్ణయంతో పాటు ట్రంప్ సొంతంగా తన ఓటమిని ఒప్పుకున్నారని అభిప్రాయపడ్డారు.

వలసదారుల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదమేంలేదని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని తన ఫేస్ బుక్ ఖాతాలో ఒబామా పేర్కొన్నారు. పేరెంట్స్ అమెరికాకు రావడమే డ్రీమర్స్ చేసిన తప్పిదం కాదని.

. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే యువతపై ఆంక్షలు విధించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా డీఏసీఏను రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోగా.. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డ్రీమర్స్ (డీఏసీఎ)

మద్ధతుదారులు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Leave a comment