Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:40 am - ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం// 3:39 am - శీతాకాల స‌మావేశాల‌పై కేంద్రం దాటవేత// 3:35 am - ఇవాంక అమెరికా టు బేగంపేట?// 3:33 am - మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం- బన్నీ వాసు// 3:32 am - ఫ‌రుఖ్ పై విరేష్ శాండిల్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు// 3:27 am - ఎపీకీ కేంద్రం అన్నీ అడ్డంకులే..?// 4:32 am - రాఘవేంద్ర స్వామిని స‌న్నిదిలో రజనీకాంత్// 4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్//

అమెరికాలోభారతీయులకు మ‌రో షాకింగ్ న్యూస్..!

Published on Sep 04 2017 // NRI

వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ విదేశీయులకు కాకపుట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. మరో కొత్త చర్యకు శ్రీకారం చుట్టారు. చిన్నతనంలోనే అమెరికాకు అక్రమంగా వలస వచ్చి.. అక్కడే ఉద్యోగాలు చేస్తున్న వారి వర్క్ పర్మిట్‌ను రద్దు చేయాలని భావిస్తున్నారు.

చిన్నతనంలోనే అమెరికాకు అక్రమంగా వలస వచ్చి ఎన్నాళ్లుగానో ఇక్కడే ఉంటున్న విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వర్క్‌ పర్మిట్‌ను ఇచ్చేలా ‘డిఫర్డ్ యాక్షన్ ఫర్ చిల్డ్రన్ అరైవల్’ పేరుతో ఒబామా సర్కారు సమయంలో ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఆ పథకాన్ని ఉపయోగించుకుని అమెరికాలో దాదాపు 7 లక్షల 50 వేల మంది విదేశీయులు ఉపాధి పొందారు. వారిలో 7500 మంది భారతీయులు కూడా ఉన్నారు.

అమెరికన్లకు ఉద్యోగాలు, అమెరికా ఫస్ట్ నినాదంతో అధ్యక్షుడయిన ట్రంప్.. ప్రస్తుతం ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా విదేశీయులపై ఆంక్షలు విధిస్తేనే తాను అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఒబామా సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్లు వైట్‌హౌస్ అధికారిక వర్గాలు చెబతున్నాయి.

అయితే ఈ విషయంలో కంగారు పడనక్కర్లేదనీ, ప్రస్తుతానికి ట్రంప్ రద్దు చేయాలని భావిస్తున్నా.. కార్యరూపం దాల్చేసరికి మార్పులు ఉండొచ్చని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి పాల్ రియాన్ వ్యాఖ్యానించారు. ట్రంప్ అనుకున్నది జరిగితే ఏకంగా 7500 మంది భారతీయులు దేశం నుంచి బయటకు రాక తప్పదు.

Leave a comment