Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

అర్జున్ రెడ్డి సినిమా స‌మీక్ష‌

Published on Sep 01 2017 // Movie News

పెళ్లిచూపులు సినిమాతో విజ‌యం అందుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర కొండ‌, త‌ర్వాత వ‌చ్చిన ద్వార‌కా సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకోలేక‌పోయాడు.

అయితే క‌థ‌, క్యారెక్ట‌ర్‌ను న‌మ్మి విజ‌య్ న‌టించిన ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ అర్జున్ రెడ్డి. సినిమా విడుద‌ల‌కు ముందు వివాదాల‌ను ఎదుర్కొంది. అందుకు కార‌ణాల‌ని ప్ర‌త్యేకంగా వెతుక్కోన‌క్క‌ర్లేదు, హీరో హీరోయిన్స్ మ‌ధ్య ఉండే ముద్దు సీన్‌పై ర‌గ‌డ అయ్యింది. అలాగే స్టేజ్‌పై కూడా విజ‌య్ దేవ‌ర కొండ స్పీచ్ అన్ని కాస్తా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

అస‌లు యూనిట్‌కు సినిమాపై న‌మ్మ‌కం గ‌ట్టిగానే ఉంది కాబ‌ట్టే విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ రేంజ్‌లో మాట్లాడాడ‌ని కొంద‌రు అంటే, ప‌బ్లిసిటీ కోస‌మే విజ‌య్ దేవ‌ర‌కొండ ఓవ‌ర్‌గా మాట్లాడాడు అని మ‌రికొంద‌రు కూడా అన్నారు. ఇలా వివాదాల న‌డుమ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అస‌లు అర్జున్‌రెడ్డి సినిమాలో ఏముంది. చిత్ర యూనిట్ న‌మ్మ‌కం ఏంటి? సినిమా ఆడియెన్స్‌ను అల‌రిస్తుందా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.

క‌థ
అర్జున్ రెడ్డి(విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మంగ‌ళూరులో హౌస్ స‌ర్జెన్ చేస్తుంటాడు. మ‌నిషి చాలా దుందుడుకు మ‌న‌స్త‌త్వాన్ని క‌లిగి ఉంటాడు. పుట్ బాల్ మ్యాచ్‌లో వేరే టీం స‌భ్యుల‌ను కొట్ట‌డంతో యాజ‌మాన్యం అర్జున్ రెడ్డి నుండి క్ష‌మాప‌ణ ప‌త్రం అడుగుతుంది.

అర్జున్ రెడ్డి త‌న చ‌ర్య‌ను స‌మ‌ర్ధించుకుని క్ష‌మాప‌ణ ప‌త్రం ఇవ్వ‌నంటాడు. అయితే యాజ‌మాన్యం స‌స్పెండ్ చేస్తాన‌ని అంటుంది. దాంతో అర్జున్ రెడ్డి కాలేజ్ నుండి వెళ్లిపోవ‌డానికి నిర్ణ‌యం తీసుకుంటాడు. అదే స‌మ‌యంలో ఫ‌స్ట్ ఇయ‌ర్ ఎంబిబిఎస్ స్టూడెంట్ అయిన ప్రీతి శెట్టి(షాలిని పాండే)ని చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డి, కాలేజీలో ఉండిపోతాడు.

అర్జున్ యూనివ‌ర్సిటీ టాపర్‌. సీనియ‌ర్ కావ‌డంతో ప్రీతిని సుల‌భంగానే క‌లుసుకుంటాడు. తొలి పరిచ‌యంలోనే ఆమెకు ముద్దు పెట్టేస్తాడు. ప్రీతి కూడా ఏమీ చెప్ప‌దు. క్ర‌మంగా ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. అర్జున్ మాస్ట‌ర్స్ కోర్సు చేయ‌డానికి మ‌సూరి వెళ్లినా ప్రీతితో రిలేష‌న్‌ను కంటిన్యూ చేస్తాడు. చివ‌ర‌కు ప్రీతి ఇంటికి వెళ్లి ఆమె తండ్రితో వారి ప్రేమ గురించి మాట్లాడుతాడు. కానీ ప్రీతి తండ్రి కుల పిచ్చితో వారి ప్రేమ‌ను అంగీక‌రించడు.

అనుకోని ప‌రిస్థితుల మ‌ధ్య ప్రీతి వేరొక‌రిని పెళ్లి చేసేసుకుంటుంది. అప్పుడు అర్జున్ రెడ్డి ప‌రిస్థితి ఎలా మారుతుంది? ప్రీతి వేరొక‌రిని పెళ్లి చేసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? అర్జున్ రెడ్డి, ప్రీతిలు క‌లుసుకుంటారా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేష‌ణ
సినిమా క‌థంతా విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, షాలిని ఇద్ద‌రి మ‌ధ్య‌నే తిరుగుతుంది. ఇద్ద‌రు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. స్వతంత్ర్య భావాలు, దుండుకు స్వ‌భావం ఉన్న యువ‌కుడి పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర కొండ న‌ట‌న చాలా బావుంది. కో

పాన్ని పీక్స్‌లో ప్ర‌ద‌ర్శించే స‌మ‌యంలో కూడా విజ‌య్ చ‌క్క‌గా న‌టించాడు. క‌థానుగుణంగా రెండు పార్శ్వాలను విజ‌య్ దేవ‌ర కొండ చ‌క్క‌గా క్యారీ చేశాడు. హీరోయిన్ షాలిని కూడా చ‌క్క‌గా న‌టించింది. మంచి అభిన‌యాన్ని క‌న‌ప‌రిచింది.

ఇక విజ‌య్ దేవ‌ర కొండ ప్రాణ స్నేహితుడు శివ పాత్ర‌లో న‌టించిన రోహిత్ రామ‌కృష్ణ పాత్ర చాలా బావుంది. సినిమాలో స‌న్నివేశాల ప‌రంగా కామెడిని క్రియేట్ చేయ‌డంలో రోహిత్ రామ‌కృష్ణ పాత్ర కీల‌కంగా మారింది. ఇక హీరో అన్న‌య్య పాత్ర‌లో క‌మ‌ల్ కామ‌రాజు, లాయ‌ర్ పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి,

హీరో తండ్రి పాత్ర‌లో సంజ‌య్ స్వ‌రూప్‌, హీరోయిన్ తండ్రి పాత్ర‌లో గోపీనాథ్ భ‌ట్ స‌హా అన్ని పాత్ర‌ధారులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే ద‌ర్శ‌కుడు సందీప్ సినిమా క‌థ‌, క‌థ‌నం రాసుకున్న విధానం బావుంది. ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీగా స‌న్నివేశాల‌ను రాసుకున్న తీరు, వాటిని తెర‌పై ప్రెజంట్ చేసిన విధానం ఆక‌ట్టుకుంటుంది. అయితే సినిమా లెంగ్త్‌ను కాస్తా త‌గ్గించి ఉండొచ్చు.

సెకండాఫ్‌లో సినిమా వ్య‌వ‌ధిని త‌గ్గించి ఉండొచ్చు. సినిమాలో మాట‌లు రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉన్నా, హ‌ద్దులు దాటిన‌ట్టే అనిపించింది. అలాగే సినిమాలో ముద్దు స‌న్నివేశాలు ఎక్కువ‌య్యాయి. వీటిని ప‌క్క‌న పెడితే సినిమాలో ప్రేమ‌లో ఫెయిలైన యువ‌కుడి మాన‌సిక స్థితిని చ‌క్క‌గా చూపించారు.

ప్రేమ‌ను మ‌ర‌చిపోవ‌డానికి విజ‌య్ దేవ‌ర‌కొండ చేసే కొన్ని స‌న్నివేశాలు కాస్తా అతిగా అనిపిస్తాయి. రాజు తోట సినిమాటోగ్ర‌ఫీ చాలా నీట్‌గా ఉంది. ప్ర‌తి స‌న్నివేశం అందంగా క‌న‌ప‌డింది.

గుండెలోనా నిండుకున్న ప్రేమ‌నంతా చూపుకున్న ఈనాడు..
ఎమిటెమిటో…
మ‌ధుర‌మే ఈ క్ష‌ణం..

అంటూ సాగే పాట‌లు బావున్నాయి. మిగిలినన్ని పాట‌లు కూడా ఆక‌ట్ట‌కుంటాయి. ముఖ్యంగా హీరోయిన్‌ను ఫ‌స్ట్ టైమ్ హీరో చూసే సంద‌ర్బంలో వ‌చ్చే సుంద‌రి అనే సాంగ్ బావుంది. ర‌ధ‌న్ చ‌క్క‌టి ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూప‌ర్బ్‌. మొత్తంగా చూస్తే అర్జున్‌రెడ్డిలో ఈత‌రం దేవ‌దాసు క‌న‌ప‌డ‌తాడు.

నిర్మాణ సంస్థ: భ‌ద్ర‌కాళి ఫిక్చ‌ర్స్
తారాగ‌ణం: విజ‌య్ దేవ‌ర కొండ‌, షాలిని పాండే, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వరూప్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, జియాశ‌ర్మ‌, అమిత్ త‌దిత‌రులు
సంగీతం: ర‌ధ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజు తోట‌
ఎడిటింగ్: శ‌శాంక్‌
నిర్మాత: ప్ర‌ణయ్ వంగా
ద‌ర్శ‌కత్వం: సందీప్ వంగా

Leave a comment