Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

పైసా వసూల్ సినిమా స‌మీక్ష‌

Published on Sep 01 2017 // Movie News

న‌టుడిగా వంద సినిమాలు పూర్తి చేసిన నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 101వ చిత్రం పైసా వ‌సూల్‌. ఈ చిత్రానికి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని ఆస‌క్తి అంద‌రిలో మొద‌లైంది. ఎందుకంటే పూరి హీరోను ప్రెజెంట్ చేసే స్టైల్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అలాంటి ఓ సీనియ‌ర్ డైరెక్టర్, మాస్ ఇమేజ్ ఉన్న బాల‌కృష్ణ‌ను తెర‌పై చూపిస్తాడో, అస‌లు బాల‌కృష్ణ కోసం పూరి ఎలాంటి క‌థ రాసుకున్నాడోన‌ని ఆస‌క్తి కూడా క్రియేట్ అయ్యింది.

అలాగే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో బాల‌య్య బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ అన్ని కొత్త‌గా ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. మ‌రి ఈ అంచ‌నాల‌ను బాల‌కృష్ణ పైసా వ‌సూల్ రీచ్ అయ్యిందా లేదా అని తెలియాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ
బాబ్ మార్లే(విక్ర‌మ్ జీత్‌) ఓ పెద్ద మాఫియా డాన్‌. పోర్చుగ‌ల్‌లో ఉంటాడు. బాబ్ త‌మ్ముడు స‌న్ని(అమిత్‌)ను ఇండియ‌న్ రా ఆఫీస‌ర్ చంపేస్తాడు. దాంతో ఇండియాపై ప‌గబ‌ట్టిన బాబ్ ఇండియాలో మార‌ణ హోమం క్రియేట్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. బాబ్‌కు ఇండియాలో ఓ మినిష్ట‌ర్‌(కృష్ణ‌కాంత్‌) స‌హా లోక‌ల్ మాఫియా అండ‌గా ఉంటుంది.

హైద‌రాబాద్‌లో రెండు, మూడు చోట్ల బాంబు పేలుళ్లు జ‌రుగ‌ుతాయి. అమాయ‌కులైన జ‌నం చ‌నిపోతారు. పోలీస్ అధికారుల‌ను మాఫియా గ్యాంగ్ చంపేస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో రా చీఫ్‌(క‌బీర్ బేడి), ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌ను ఈ మాఫియాకు వ్య‌తిరేకంగా వాడుకుని అంతమొందించాల‌నుకుంటాడు.

అందులో భాగంగా తేడాసింగ్‌(నంద‌మూరి బాల‌కృష్ణ‌)తో పోలీస్ డిపార్ట్‌మెంట్ డీల్ కుదుర్చుకుంటుంది. తేడాసింగ్ త‌ను ఉండే కాల‌నీలో త‌న ప‌క్కింట్లో ఉండే హారిక‌(ముస్కాన్‌) వెంట‌ప‌డుతుంటాడు. హారిక తన అక్క‌య్య సారిక‌(శ్రియా) కోసం వెతుకుతూ ఉంటుంది.

పోర్చుగ‌ల్ వెళ్లిన సారిక క‌న‌ప‌డకుండా పోతుంది. అయితే చివ‌ర‌కు హారికకు, త‌న‌ అక్క‌య్య సారిక‌కు, తేడాసింగ్‌కు మ‌ధ్య ఓ రిలేష‌న్ ఉంద‌ని తెలుస్తుంది. ఆ రిలేష‌న్ ఏంటి? అస‌లు తేడా సింగ్ ఎవ‌రు? సారిక‌, హారిక ఫ్యామిలీకి తేడాసింగ్ ఎందుకు ద‌గ్గ‌ర‌వుతాడు? అస‌లు సారిక ఏమవుతుంది? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌
ఇప్ప‌టిదాకా నంద‌మూరి బాల‌కృష్ణ చేసిన 100 సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. ఇందులో బాల‌య్య నూత‌నోత్సాహంతో క‌నిపించారు. భారీ డైలాగులు, భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాల‌య్య‌కు కొత్త కాదు. కానీ ఈ సినిమాలో ఆద్యంతం కొత్త‌గా చేశాడు. బీహార్‌లో తాగించిన‌వాడిని తీహార్‌లో పోయించా తూ క్యారే అవులే,

న‌న్ను ఇక్కడ కాల్చాలంటే నా అభిమానులైనా అయ్యి ఉండాలి, నా బంధువులైనా అయి ఉండాలి, సింహానికి మేక ఎరేయాల‌నుకోవ‌డం క‌ర‌క్టే కానీ ఆ ప్లాన్ని మేక‌ల‌న్నీ క‌లిపి చేయ‌డ‌మే ఫన్నీగా ఉంది.. వంటి చాలా డైలాగులు ఈ సినిమాలో ఆడియ‌న్స్ ని మెప్పిస్తాయి. `జేబులో చెయ్యిపెట్టు.. ఏమైనా త‌గిలిందా..` వంటి మాస్ డైలాగులను కూడా బాల‌య్య అందంగానే ప‌లికారు. సినిమాలో ప్ర‌త్యేకంగా పెద్ద‌గా కామెడీ లేదు. అ

లీ పాత్ర‌ను చూడ‌గానే ఎవ‌రైనా కామెడీ ఉంటుంద‌ని ఊహిస్తారు. కానీ అలీ పాత్ర ఉండాలి కాబ‌ట్టి ఉన్న‌ట్టు అనిపిస్తుంది. రా ఏజెంట్‌గా బాల‌కృష్ణ‌ను దర్శ‌కుడు ఎలివేట్ చేసిన తీరు, బాల‌కృష్ణ వ్యావ‌హారిక శైలి చాలా వ‌ర‌కు `పోకిరి` చిత్రాన్ని, పూరి గ‌త చిత్రాల‌ను గుర్తుచేస్తాయి. కెమెరాప‌రంగా, ఎడిటింగ్ ప‌రంగా సినిమా బాగా ఉంది. కానీ మావా ఏక్ పెగ్ లా, ప‌ద మ‌రి, పైసా వ‌సూల్ పాట‌లు బావున్నాయి. రీరికార్డింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్‌గా ఉంటే బావుండేదేమో.

హీరోయిన్లు వారి వారి ప‌రిధుల్లో బాగానే న‌టించారు. మినిస్ట‌ర్‌గా న‌టించిన కృష్ణ‌స్వామి శ్రీకాంత్ ముఖంలో భావోద్వేగాలు స‌రిగా ప‌ల‌క‌లేదు. క‌థలోనూ చెప్పుకోద‌గ్గంత కొత్త‌ద‌నం ఏమీ లేదు. క్లైమాక్స్ లో బాల‌కృష్ణ దేశం గురించి, దేశ‌భ‌క్తి గురించి మాట్లాడిన తీరు మెప్పిస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే మాస్‌ను, బాల‌కృష్ణ అభిమానుల‌ను అల‌రించే పూరి జ‌గ‌న్నాథ్ మార్కు చిత్ర‌మిది.
బ్యాన‌ర్: భ‌వ్య క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియాశ‌ర‌న్‌, ముస్కాన్‌, కైరా ద‌త్‌, క‌బీర్ బేడి, విక్ర‌మ్ జీత్‌, పృథ్వీరాజ్‌, అలీ త‌దిత‌రులు
మ్యూజిక్: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: ముఖేష్‌.జి
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
నిర్మాత: వి.ఆనంద ప్ర‌సాద్‌
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌

Leave a comment