Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

ఏపీ సచివాలయం రాయపూడిలో

Published on Jan 03 2016 // News

రాజధాని తాత్కాలిక సచివాలయాన్ని ముందుగా అనుకున్నట్లు అమరావతి టౌన్‌ షిప్పులో కాకుండా రాయపూడిలో నిర్మించను న్నారు. అమరావతి టౌన్‌ షిప్‌కు చేరేందుకు రోడ్డు సరిగా లేనందున ఈ నిర్మాణం రాయ పూడికి మారింది.

భవిష్యత్‌లో అక్కడే శాశ్వత నిర్మాణాలొస్తున్న అందుకనుణంగానే ఈ తాత్కాలిక నిర్మాణమూ చేపట్టాలని నిర్ణయిం చారు. రాయపూడికి దక్షిణంలో ఈ నిర్మాణం రానుంది. ఇరవై ఎకరాల్లో నిర్మించనున్న ఈ భవనాలకు సుమారు రూ.180 కోట్లు ఖర్చవు తుదని అంచనా. ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం క్రిడాకు ఉత్తర్వులిచ్చింది.

ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అంత మొత్తాన్ని ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదని, ముందుగా కొంత అప్పు చేసి నిర్మాణాలు చేపడితే, తరువాత తాము సమ కూరుస్తామని తెలిపినట్లు సమాచారం. క్యాపి టల్‌ సిటీ ప్లాన్‌కు ఫైనల్‌ నోటిఫికేషన్‌ పూర్తయ్యే నాటికి ఈ ప్రక్రియ మొదలుపెట్టా లని నిర్ణయించారు.

ఇందుకు బిల్డర్ల కోసం వెతుకుతున్నారు. వచ్చిన ప్లాన్లు కాకుండా మరి ంత మెరుగైన ప్లాన్‌ కోసం చూస్తున్నామని అధికారులు తెలిపారు. సుమారు రూ.180 కోట్ల అంచనా వ్యయంలో ప్రభుత్వం రూ.60 కోట్లు వెచ్చించనుంది. మిగిలింది హడ్కో నుండి అప్పు తీసుకోవాలి.

అందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే తీసు కునే అప్పుకు రెట్టింపు విలువైన ఆస్తన్నా తాకట్టు పెట్టాలి. కేంద్రం నుండి నిధులొచ్చాక అప్పును తీర్చుకోవచ్చనే ఆలోచనతో ప్రభుత్వమున్నట్లు తెలిసింది. రాజధానికి కేంద్రం నిధులిస్తామని చెబుతున్నా గతంలో విడుదలైన నిధులకు యుసీలు ఇవ్వకుండా కేంద్రం వెంటవెంటనే నిధులు విడుదల చేసే వీలులేదు.

ఈ తాత్కా లిక నిర్మాణానికి డిపిఆర్‌ తయారు చేసి కేంద్రానికి పంపి ఆమోదం తీసుకోవాలా? లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఖర్చు చేయాలా? అనే అంశంపై తర్జన భర్జన సాగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పస్టమైన నిర్ణయానికి రానుంది.

Leave a comment