Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

సౌదీలో మ‌త‌గురువుతో స‌హ‌47 మందికి ఉరి

Published on Jan 03 2016 // National

షియా మత గురువు షేక్‌ నిమిర్‌ ఆల్‌ నిమిర్‌తో సహా 47 మందికి శనివారం మరణదండన అమలు చేసినట్టు సౌదీ అరేబియా హోంమంత్రిత్వశాఖ అధికారులు ప్రకటించారు. రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించేందుకు ప్రభుత్వం ఈ మరణ దండనను ఒక సాధనంగా వాడుకుంటోందని దేశీయంగా, అంతర్జాతీ యంగా పలువురు విమర్శిస్తున్నారు.

తీవ్రవాద కార్యకలా పాలకు పాల్పడుతున్నందనే వారికి శిక్ష విధించినట్టు సౌదీ అరేబియా ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. సౌదీ అమలుచేస్తున్న మరణశిక్షలపై విమర్శలు చేయ టం…తీవ్రవాదులకు మద్దతు పలకటమేనని రియాద్‌లోని విదేశాంగ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

2015లో 150 మందికిపైగా మరణశిక్షలను సౌదీ అమలు చేసింది. మానవ హక్కుల సంఘాల లెక్కల ప్రకారం గత 20 ఏండ్లలో ఇది అత్యధికం. 1995లో 192 మందికి సౌదీ మరణశిక్ష అమలుజేసింది. సౌదీలోని 12 ప్రాంతాల్లో శనివా రం 47 మందికి ఉరిశిక్షను అమలుచేశారు. షేన్‌ నిమిర్‌ మేనల్లుడు ఆలీ (17) ఆనాటి నిరసనల్లో పాల్గొన్నాడు.

ఇతనికి కూడా సౌదీ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. అయి తే మరణశిక్షకు గురైన వారి జాబితాలో అతడి పేరు లేదు. 2011లో సౌదీ అరేబియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తూర్పు ప్రావిన్స్‌లో షియా వర్గం ప్రజలు నిరసనలకు దిగా రు. తమ పట్ల సౌదీ ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని ఈ వర్గం ప్రజలు ఆందోళనకు దిగారు.

షేక్‌ నిమిర్‌కు ఉరి శిక్ష విధించటాన్ని ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. ఇరాక్‌లోని షియా కూటమి, లెబనా న్‌ షియా కౌన్సిల్‌ షేక్‌ నిమిర్‌కు మరణశిక్ష విధించటాన్ని తీవ్రంగా తప్పుబ ట్టింది. బహ్రెయిన్‌లో షియా వర్గం ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.

షేక్‌ నిమిర్‌ తరుచూ సౌదీ రాజకుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తూండేవారు. గత దశాబ్దకాలంలో అనేకమార్లు అతన్ని సౌదీ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధ శిబిరంలో పెట్టారు.

అమెరికాకు వ్యతిరేకంగా, ఇరాన్‌కు అనుకూలంగా మాట్లాడొద్దంటూ ఆయన్ని పోలీసులు తీవ్రంగా వేధించారు. 2011 తర్వాత సౌదీ షియా యువతలో ఆయన పట్ల విపరీతమైన ఆదరణ కనపడింది. 2014, అక్టోబర్‌లో షేక్‌ నిమిర్‌కు మరణదండన విధించాలని సౌదీ నిర్ణయించింది.

సౌదీ తీరుపై సర్వత్రా విమర్శలు
మరణ శిక్ష విధించటంలో సౌదీ న్యాయమూర్తులు ‘న్యాయ విచక్షణ’కు ప్రాధాన్యత ఇస్తున్నారని, చట్టంలో పేర్కొ న్న నేరం-శిక్షను పరిగణనలోకి తీసుకోవటం లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సౌదీ మరణశిక్షలు ఏమాత్రం న్యాయస మ్మతంగా లేవని వారు నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాయి. షియా వర్గానికి చెందిన దోషులపై ఎక్కువగా మరణశిక్షలు అమలు చేస్తున్నారని ప్రముఖ పరిశోధకురాలు డాల్ఫిన్‌ లార్టా అంటున్నారు.

Leave a comment