Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

ఆర్‌జెడి, జెడి(యు) మధ్య ముస‌లం

Published on Jan 03 2016 // Politics

బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే ముసలం పుట్టిందా? ప్రధాన పార్టీలైన జేడీ(యూ), ఆర్జేడీ నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయా? కొందరు నేతల వ్యాఖ్యలు చూస్తే అలాగే అనిపిస్తోంది.

సంకీర్ణంలో కీలక భాగస్వామ్య పార్టీ ఆర్జేడీ సీనియర్ నేత ఒకరు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై మండిపడ్డారు. నేరాల రేటు పెరుగుతోందని, అందుకు సీఎం నితీష్ కుమారే బాధ్యత వహించాలని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ వ్యాఖ్యానించారు. గత వారంలో ముగ్గురు ఇంజనీర్లు, ఒక వ్యాపారి హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ హత్యోదంతాలు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు అద్దం పడుతున్నాయన్నారు. ప్రభుత్వ రథసారధిగా ఉన్న నితీష్.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు చొరవ చూపాలన్నారు.

తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొగడ్తలకు పొంగిపోవడం జేడీ(యూ)కు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. ఇకనైనా ఈ వైఖరికి స్వస్తి చెప్పి నేరాలను అదుపు చేయడానికి కృషి చేయాలని కోరారు.

కాగా రఘువంశ్ వ్యాఖ్యలపై జేడీ(యూ) నేత, మాజీ మంత్రి శ్యాం రాజక్ స్పందించారు. అస్తవ్యస్త పాలనతో బీహార్‌ను ఆటవిక రాజ్యంగా మార్చిన ఆ పార్టీ నేతలు తమకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆయన విమర్శల్ని తిప్పికొట్టారు.

మరోవైపు కాంగ్రెస్ నేత, బీహార్ విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి, శాంతి భద్రతల విషయంలో నితీష్ వైఖరి గతంలో దేశవ్యాప్తంగా ప్రశంసలందుకొందని తెలిపారు.

గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను దెబ్బకొట్టి తీరుతామని, తప్పకుండా ఓడిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ అన్నారు.

జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల కూటమి ఎన్డీయేను ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ కూటమిలో ఎలాంటి విభేధాలు లేవని అప్పట్లో వారు స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 సీట్లలో జేడీయూకు 100, ఆర్ జేడీకి 100, కాంగ్రెస్ 40 సీట్లలో పోటీచేసింది.

జేడీయూ, ఆర్జేడీ పోటీ పోటీ ప్రభావాన్ని కలిగి ఉన్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు సమానంగా సీట్లు కేటాయించి వాటికన్నా తక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. ఈ సీట్ల కేటాయింపులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం ఎక్కువగా ఉంది.

Leave a comment