Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

బర్దన్ మృతిపై ప్రభృతుల సంతాపం

Published on Jan 03 2016 // News

సీనియర్‌ కమ్యూనిస్టు నేత ఏబీ బర్ధన్‌ శనివారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. 92 సంవత్సరాల కామ్రేడ్‌ బర్ధన్‌ గత డిసెంబర్‌ 7న పక్షవాతానికి గురి కాగా ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.

అప్పటి నుంచీ తీవ్ర అస్వస్థతతో కొనసాగిన బర్ధన్‌ కొత్త ఢిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. బర్ధన్‌ పూర్తి పేరు అర్ధేందు భూషణ్‌ బర్ధన్‌. 1924, సెప్టెంబర్‌ 24న ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్న సిల్హెట్‌లో ఆయన జన్మించారు. 1940వ దశకంలో ఆయన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో చేరి విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు.

అదే సమయంలో ఆయన అప్పటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడయ్యారు. ఆనాడు పార్టీపై నిషేధం ఉండింది. 1941 నుంచి ఆయన పూర్తికాలం కార్యకర్తగా పని చేయసాగారు. మొదట ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడిగా పని చేసిన బర్ధన్‌, అనంతరం మహారాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.

ట్రేడ్‌ యూనియన్‌ ఆర్గనైజర్‌గా ఆయన విద్యుత్తు, రైల్వే, టెక్స్‌టైల్‌, రక్షణ, ప్రెస్‌, ఇంజినీరింగ్‌ రంగాలకు చెందిన కార్మికుల్లో, ఉద్యోగుల్లో పని చేశారు.

ఆయనను పోలీసులు అనేక మార్లు అరెస్టు చేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ఆయనను జైలులో నిర్బంధించారు. ఆయన నాలుగున్నరేళ్ల పాటు జైలు జీవితం గడిపారు.

రెండేళ్ల పాటు ఆయన అజ్ఞాత జీవితం కూడా గడిపారు. ఆ సమయంలో ఆయన కోల్‌కతాలో కార్మికోద్యమ ఆర్గనైజర్‌గా పని చేశారు.

సీపీఐ మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర రాష్ట్ర కమిటీలలో ఆయన సభ్యుడిగా పని చేశారు. 1957లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా మహారాష్ట్ర విధానసభకు ఎన్నికయ్యారు.

1968లో జరిగిన సీపీఐ 8వ కాంగ్రెస్‌లో ఆయన జాతీయ సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1990వ దశకంలో ఆయన కేంద్ర స్థాయి రాజకీయాలలో ప్రవేశించారు.

1995లో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా పని చేసిన తర్వాత, 1996లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2012 వరకు ఆయన ఆ బాధ్యతలో కొనసాగారు.

కార్మికోద్యమ నేతగా ఆయన ఏఐటీయూసీలో కూడా పలు బాధ్యతలు నిర్వహించారు. 1994లో ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బర్ధన్‌ మృతికి వామపక్ష పార్టీలు సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.

మహారాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ముఖ్యంగా విదర్భ ప్రాంతంలో కామ్రేడ్‌ సుధాం దేశ్‌ముఖ్‌తో కలిసి బలమైన కమ్యూనిస్టు పార్టీని నిర్మించారు.

1957-62 కాలంలో మహారాష్ట్ర అసెంబ్లీకి నాగపూర్‌ నుంచి ఎన్నికయ్యారు. బహు భాషల్లో ఆయనకున్న పరిజ్ఞానం ఆయనను ఒక గొప్ప వక్తగా తీర్చిదిద్దాయి.

ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం జి.బి.పంత్‌ ఆసుపత్రులోనే నాయకులు సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం సిపిఐ పార్టీ ప్రధాన కార్యాలయం(అజరుభవన్‌)కు పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచి, అటుపిమ్మట నాగాపూర్‌కు తరలిస్తారు. తరువాత ఆయన భౌతిక కాయాన్ని అవయవ దానం నిమిత్తం నాగాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగిస్తారు.

Leave a comment