Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఉగ్ర‌దాడి..పంజాబ్‌ అంతటా రెడ్‌ అలర్ట్‌

Published on Jan 03 2016 // News

పంజాబ్‌లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో అధునాతన ఆయుధాలతో వచ్చిన పాకిస్తాన్‌ ఉగ్రవాదులు పఠాన్‌కోట వైమానిక స్థావరంలోకి చొచ్చుకెళ్లి ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. వీరిని జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా అనుమానిస్తున్నారు.

ఉగ్రవాదుల ఆకస్మిక దాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు దాడిని దీటుగా ఎదుర్కొన్నాయి. దాదాపు 15 గంటలపాటు కొనసాగిన ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ముగ్గురు జవాన్లు అమరులయ్యారు.

మరణించిన ముగ్గురు భద్రతా సిబ్బందిలో ఐఎఎఫ్‌ గార్డ్‌ కమాండో వున్నట్లు రక్షణవర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్రమోడీ లాహోర్‌లో ఆకస్మిక పర్యటన జరిపి సరిగ్గా వారం రోజుల తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం.

పాకిస్తాన్‌ సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న ఈ వైమానిక స్థావరం రక్షణ వలయాన్ని ఛేదించి వారు లోపలికి చొచ్చుకొచ్చారని పోలీసు, భద్రతాధికారులు తెలిపారు. ఈ స్థావరంలో వైమానిక దళాలు ఉపయోగించే మిగ్‌-21 ఫైటర్‌ విమానాలతోపాటు ఎంఐ-25 ఎటాక్‌ హెలికాప్టర్లు ఉంటాయి.

వైమానిక స్థావరాన్ని నాశనం చేసే లక్ష్యంతోనే వారు ఈ దాడికి తెగబడ్డారు’ అని పంజాబ్‌ పోలీసు ఎడీజీపీ (శాంతి భద్రతలు) హెచ్‌ దిలాన్‌ చెప్పారు. ఉగ్రవాదుల వద్ద పెద్ద మొత్తంలో ఆర్‌డిఎక్స్‌ వుందని, వీరు వెనకవైపున అరణ్య ప్రాంతం నుండి వైమానిక స్థావరంలోకి ప్రవేశిం చేందుకు ప్రయత్నించారని రక్షణ వర్గాలు తెలిపాయి.

ఐఎ ఎఫ్‌ సముదాయానికి వెలుపల ప్రహారీకి సమీపంలోని తినుబండారాల స్టాల్‌ను దాటి ఉగ్రవాదులు ముందుకు వెళ్ళలేకపోయారని, వారిని ఎదుర్కోవడానికి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారని ఆ వర్గాలు వివరించాయి.
దాడి ఘటన నేపథ్యంలో మరికొందరు ఉగ్రవాదులు ఉండి ఉండవచ్చన్న అనుమానంతో పఠాన్‌కోట్‌ ప్రాంతాన్ని పోలీసులు, భద్రతా దళాలు జల్లెడపట్టాయి.

కూంబింగ్‌ నిర్వహిస్తున్న సందర్భంలో ఎదురుకాల్పులతోపాటు, ఒకచోట పేలుడు సంఘటన కూడా చోటుచేసుకుంది.. కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు సహాయపడేందుకు వైమానిక దళం రెండు హెలికాఫ్టర్లను ఉపయోగించింది. వైమానిక స్థావరంలోని హెలికాఫ్టర్లు, ఇతర పరికరాలు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.

దాడి నేపథ్యంలో పంజాబ్‌ అంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. పంజాబ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం 6 నెలల వ్యవధిలో ఇది రెండో సారి. జులై 27న గురుదాస్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మృతిచెందిన విషయం తెలిసిందే.
పాక్‌ ఖండన
పఠాన్‌కోట్‌ ఉగ్రదాడిని పాకిస్తాన్‌ ఖండించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వైమానిక దళ సైనికులకు నివాళులర్పించింది. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

‘ఇటీవల రెండు దేశాల ఉన్నత స్థాయి సంబంధాలు మెరుగయ్యాయి. మన ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు భారత్‌తో సహా ఇతర దేశాలతో పాకిస్తాన్‌ భాగస్వామిగా ఉండేందుకు కట్టుబడిఉంది’ అని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.
పఠాన్‌కోట్‌ దాడి నేపథ్యంలో

జమ్మూకాశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం
పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో ప్రత్యేకంగా వైమానిక స్థావరాలు, ఇండో-పాక్‌ సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘ఇప్పటికిప్పుడు నిర్దిష్ట బెదిరింపు ఏమీ లేదు.

ఇక్కడ ఎప్పుడూ ముప్పు పొంచే వుంటుంది. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఎలాంటి ఘటనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధులమై ఉండాలి’ అని జమ్మూకాశ్మీర్‌ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ) రాజేంద్ర కుమార్‌ చెప్పారు. సరిహద్దువెంబడి చొరబాట్లకు అనువైన మార్గాలన్నీ మూసివేశాం.

జాతీయ రహదారులపై బారికేడ్లను ఉంచాం. రాష్ట్రంలోకి వచ్చే అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నాం’ అన్నారు. పఠాన్‌కోట్‌ దాడి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన డీజీపీ జమ్మూ జిల్లాలోని పలు సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు.

‘జమ్మూలోని భారత్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతాలను నేను స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాను’ అని అన్నారు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి తర్వాత జమ్మూకాశ్మీర్‌లోని వివిధ భద్రతా సంస్థలు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయని చెప్పారు.

జమ్మూ-పఠాన్‌కోట్‌ జాతీయ రహదారి వెంబడి అన్ని పోలీస్‌ స్టేషన్ల ప్రాంతాలలో, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అదనపు నిఘా పెట్టామన్నారు.

జమ్మూ-పఠాన్‌కోట్‌ జాతీయ రహదారిపై చెక్‌పోస్టులను కూడా పెంచామని డీజీపీ తెలిపారు. ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్ల వెలుపల, జమ్మూ, శ్రీనగర్‌ విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.

పఠాన్‌కోట్ దాడి – 8 మంది మృతి
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో మొత్తం ఎనిమిది మంది మృతిచెందారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదే దాడిలో మరో నలుగురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడులతో పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

గరుడ కమాండోలతో పాటు ప్రత్యేక ఆర్మీ దళాలు ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. హెలికాప్టర్లు, మానవరహిత విమానాలను ఆపరేషన్‌లో వినియోగించారు. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఫైరింగ్ నిలిచిపోయినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు.

Leave a comment