Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

పాక్‌లో తొమ్మిది మంది ఉగ్రవాదులకు ఉరి

Published on Jan 02 2016 // National

పాక్‌లో వివిధ ప్రాంతాల్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడి మిలిటరీ కోర్టులో దోషులుగా తేలిన తొమ్మిది మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష ఖరారైంది. శుక్రవారం ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రాహీల్‌ షరీఫ్‌ ఐఎస్‌పీఆర్‌ ( ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ) ద్వారా ధ్రువీకరించారు. ఉరిశిక్ష పడిన వారిలో ఆత్మాహుతి దాడులు, సైనికులపై దాడులు జరిపిన కరడుగట్టిన ఉగ్రవాదులున్నారని తెలిపారు.

ఉరిశిక్ష పడిన వారి వివరాలను ఆయన వెల్లడించారు. రావల్పిండిలోని పరేడ్‌ లేన్‌ మసీదు పై దాడి జరిగిన ఘటనలో దోషిగా తేలిన మొహమ్మద్‌ ఘోరీ కూడా ఉన్నట్టు సమాచారం. అతను టీటీపీ ( తెహ్రీక్‌-ఈ-తాలిబాన్‌ పాకిస్తాన్‌) ఉగ్రవాద సంస్థలో క్రియాశీలక సభ్యునిగా ఉన్నాడు.

2009 డిసెంబర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 38 మంది మృతి చెందగా, మరో 57 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి కేసుతో పాటు అతను మరో నాలుగు కేసుల్లో దోషిగా తేలాడు. ముల్తాన్‌లోని ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో హస్తమున్న హర్కత్‌ -ఉల్‌-జీహాద్‌-ఇ-ఇస్లాం కీలక సభ్యుడు అబ్దుల్‌ ఖయ్యూంకు కూడా ఉరిశిక్ష పడింది.

ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 72 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, అతనిపై నమోదై ఉన్న మరో ఏడు కేసుల్లో ఖయ్యూం దోషిగా తేలాడు. ఎల్‌ఈఏ (లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ ) పై బాంబుదాడి జరిపిన కేసులో దోషిగా తేలిన అల్‌ఖైదా సభ్యుడు అక్సన్‌ మహబూబ్‌కు ఉరిశిక్ష పడింది.

అతను సృష్టించిన మారణహోమంలో అనేక మంది సైనికులు చనిపోయారు. దీంతో పాటు అతనిపై మరో నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. ఆ కేసుల్లోనూ తన నేరాన్ని న్యాయమూర్తి ముందు అంగీకరించడంతో మహబూ బ్‌కు ఉరిశిక్ష పడింది.

ఎల్‌ఈఏ దాడులతో ప్రమేయమున్న ఇమ్రాన్‌కు కూడా ఉరిశిక్ష పడింది. సిపాయి-ఇ-సహాబా పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలో సభ్యులుగా ఉన్న మరో ఐదుగురు ఉగ్రవాదులకు కూడా ఉరిశిక్ష పడింది.

వారందరూ లాహోర్‌లో పలువురు అమాయకులను చంపిన కేసులో దోషులుగా తేలారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాద కార్యకలాపాల కేసులపై త్వరితగతిన విచారణ చేపట్టాలనే ఉద్దేశంతో 2014లో పాక్‌ ప్రభుత్వం మిలిటరీ కోర్టును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Leave a comment