Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

రాహుల్ విమర్శలను పట్టించుకోని మోడి

Published on Jan 02 2016 // Politics

కొత్త సంవత్సరంలో ఎనిమిది ముఖ్యమైన రంగాల్లో లక్ష్యాలను నిర్దేశించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, వాటి సాకారానికి అధికారులు సహకరించాలని కోరారు.

కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల కార్యద ర్శులతో తన ఇంట్లో సమావేశమైన మోదీ, కొత్త సంవత్స రంలో తాను చేయాలనుకున్న పనులను వివరించారు.

ప్రాధాన్యతా రంగాలను వివరించి, తన సిఫార్సులు అమ లయ్యేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కోరారు. ప్రొడక్ట్, ప్రాసెస్, డెలివరీపై ప్రధానంగా దృష్టిని సారించా లని, ‘సిటిజన్ జడ్జ్’ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

చేపట్టిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, రాజకీయాల గురించి పట్టించుకోవద్దని, ఏ రాష్ట్రంలో ప్రజల తీర్పు ఎలాగున్నా వాటిని అంగీకరించి ముందుకు సాగాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మోదీ చెప్పినట్టు, పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ ఉన్నతాధికారి వివరించారు.

కాగా, దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, స్ష్ము స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీఎంఓ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు.

తాము అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రాధాన్యతలను గుర్తించి, లక్ష్యాలను నిర్దేశించుకుని ముందడుగు వేయాలని, ఎప్పటికప్పుడు అవి అమలవుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తుండాలని మోదీ తన న్యూ ఇయర్ విజన్‌ను అధికారుల ముందుంచారు.

సుపరిపాలన, ఉద్యోగ సృష్టి, విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, నిధుల కేటాయింపులు, సమ్మిళిత వృద్ధి, స్వచ్ఛ భారత్, గంగా నది శుద్ధి, ఇంధన వినియోగం అంశాల్లో మరింత మెరుగైన పనితీరును ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏమాత్రం ప్రభావితం చేయలేదనే చెప్పాలి.

నిత్యం విదేశాల్లో పర్యటిస్తున్న మోదీ, దేశంలో జరుగుతున్న వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫారిన్ పాలసీలో తనదైన ముద్ర వేసిన నరేంద్ర ఏడాదిన్నరలో చాలా దేశాల్లోనే పర్యటించారు.

గత నెలలో అందరికీ షాకిస్తూ గంటల ముందు ఖరారైన పాకిస్థాన్ పర్యటనకూ ఆయన వెళ్లివచ్చారు. ఇక 2016లోనూ ఇదే తరహా ఫారిన్ పాలసీతోనే ఆయన ముందుకు వెళ్లనున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఖరారైన షెడ్యూల్ ప్రకారం మోదీ ఆరు దేశాల్లో పర్యటించనున్నారు.

ఇక మొన్నటి లాహోర్ పర్యటన తరహాలో అప్పటికప్పుడు నిర్ణయమయ్యే విదేశీ పర్యటనలు వీటికి అదనం. ఇప్పటిదాకా ఖరారైన మోదీ విదేశీ పర్యటనల షెడ్యూల్ పై ఓ లుక్కేద్దాం.

ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనలో భాగంగా మోదీ అమెరికా వెళ్లనున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 దాకా… అంటే రెండు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటిస్తారు.

అణు భద్రతపై జరిగే సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లనున్న మోదీ… అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.

ఇక రెండో పర్యటన కింద జూలైలో లాటిన్ అమెరికా దేశం వెనిజులాకు వెళ్లనున్నారు. ఇండో-జపాన్ సదస్సుకు సంబంధించి ఇరు దేశాల ప్రధానుల భేటీకి ఈ ఏడాది జపాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. ఇందుకోసం ప్రధాని ఈ ఏడాదిలో జపాన్ లో పర్యటించనున్నారు.

మొన్న షాకిచ్చినట్లుగా కాకుండా ఈ ఏడాది మోదీ పాకిస్థాన్ పర్యటనకు ముందుగానే చెప్పి వెళతారు. సెప్టెంబర్- నవంబర్ మాసాల్లో జరగనున్నట్లుగా భావిస్తున్న సార్క్ సదస్సు పాక్‌లో జరగనుంది. ఈ సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. నవంబర్ ఒక్క నెలలోనే మోదీ రెండు, మూడు దేశాల్లో పర్యటించే అవకాశాలున్నాయి.

అసియాన్ సదస్సు కోసం ఆయన నవంబర్ లో లావోస్ లో పర్యటించనున్నారు. ఇక జీ-20 సదస్సుకు హాజరయ్యే నిమిత్తం ఆయన అదే నెలలో చైనాలోనూ పర్యటించాల్సి ఉంది.

Leave a comment