Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

తెలంగాణ‌లో రూ. 125 కోట్లు తాగేశారు

Published on Jan 02 2016 // News

తెలంగాణలో 2015కు వీడ్కోలును, అలాగే 2016 నూతన సంవత్సరాన్ని భారీ ఎత్తున స్వాగతం ఫలికారు. డిసెంబర్ 31న ఒక్క రోజు తెలంగాణాలో సుమారుగా రూ.125కోట్లు తాగేశారు.

డిసెంబర్ 31 వీడ్కోలు సందర్భంగా రాష్ట్రంలోని 10 జిల్లాలలో మద్యం విక్రయాలు రూ.125కోట్ల మేరకు జరిగినట్లు అబ్కారిశాఖ అధికారులు తెలిపారు.

అయితే ఇది గత ఏడాదికన్న రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు నెరిపినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో ఓ పక్క కరవు విలయతాండవం చేస్తున్నా…మద్యం విక్రయాలలో మాత్రం ఏ నెలలో కూడా తగ్గుదల కనిపించకపోవడం గమ నార్హం.

ఏటా రూ.12వేల కోట్ల మేరకు మద్యం విక్రయాలతో ఆదాయం రావాలని ప్రభుత్వం టార్గెట్‌ను నిర్ణయించిందని, అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో టార్గెట్‌ను అధిగమించి సునా యసంగా 16వేల కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూ ర్చనున్నట్లు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో ఒక్క రోజు రూ.5కోట్ల మేరకు విక్రయాలు నెరిపినట్లు సమచారం. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ జంటనగ రాల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. కేవలం న్యూ ఇయర్ ఒక్క రోజే రూ.70కోట్ల విలువైన మద్యం విక్ర యాలు నెరిపినట్లు అబ్కారి అధికారులు తెలిపారు.

2015కు వీడ్కోలు, 2016 సంవత్సరానికి ఆహ్వానం సందర్భంగా గురువా రం సాయంత్రం నుంచి కుర్రకారు హంగామా మొదలుపెట్టారు. మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, రిసార్టులు, స్టార్ హోటళ్లు, పబ్‌లు మద్యం ప్రియులతో కిటకిటలాడాయి.

Leave a comment