Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

వైద్య శాఖను ప్రక్షాళన..చేస్తా-చంద్ర‌బాబు

Published on Jan 02 2016 // News

వైద్య ఆరోగ్య శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రయివేటు ఆసుపత్రులకు దీటుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులనూ అభివృద్ధి చేస్తానన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో నిర్మించిన వంద పడకల ప్రసూతి, శిశు ఆరోగ్య కేంద్రాన్ని, 102 కాల్‌ సెంటర్‌, తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సమస్యలతో అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపై వారు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రానున్న రోజుల్లో ఏరియా ఆసుపత్రులు, పిహెచ్‌సిల్లో సైతం అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఫిబ్రవరి కల్లా జిల్లా ఆసుపత్రిలో 60 రకాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో 40 రకాలు, పిహెచ్‌సిల్లో 19 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని, దీన్ని పూర్తిస్థాయిలో ఔట్‌సోర్సింగ్‌కు అప్పగిస్తామని చెప్పారు.
తల్లీబిడ్డ క్షేమంగా ఇంటికి చేరేందుకు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ను ప్రారంభించామన్నారు. వెయ్యి నర్సు పోస్టులు, 500 వైద్యుల పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నట్లు వివరించారు.

ప్రభుత్వ వైద్యులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ప్రభుత్వాసుపత్రిలోనే ఉండేలా బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

డ్యూటీ ఎగ్గొట్టి ప్రయివేటు ప్రాక్టీసు చేసుకునే వారు ఉద్యోగానికి రాజీనామా చేయాలని సూచించారు. అనంతరం ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఎంఎల్‌ఎలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు పలువురి శుభాకాంక్షలు
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రతోపాటు విజయవాడ ఎంపి కేశినేని నాని, అనంతపురం ఎంపి జెసి దివాకరరెడ్డి, చింతలపూడి ప్రభాకర్‌ తదితరులు శుభాకాంక్షలు అందజేశారు.

నూతన సంవత్సరంలో మరిన్ని విజయాలు సాధించాలని వారు కోరారు. ఉదయానే ఇంటివద్ద కూడా పలువురు కలిసి అభినందనలు తెలిపారు.

Leave a comment