Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

మూకుమ్మడి సెలవుల్లో డిల్లీ అధికారులు

Published on Jan 01 2016 // News

డానిక్స్‌ కేడర్‌ అధికారులు ఇద్దరిని సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీ ప్రభుత్వ అధికారులు గురువారం మూకుమ్మడి సెలవుపెట్టారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే వారు ఈ చర్యకు పూనుకున్నారు.

కేంద్ర హోం మంత్రిత్వశాఖ జోక్యం చేసుకుని ఈ సస్పెన్షన్‌ ఉత్తర్వులు చెల్లబోవని ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులను నిలబెట్టేందుకే కేంద్రం ఈ వైఖరి తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

నెట్‌ ఫైల్‌పై సంతకం చేయడానికి తిరస్కరించినందుకు ఆప్‌ ప్రభుత్వం హోం శాఖకు చెందిన ఇద్దరు సీనియర్‌ సివిల్‌ అధికారులను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 70మంది ఐఎఎస్‌ అధికారులు అరపూట సెలవు పెట్టి సస్పెండైన అధికారులకు తమ సంఘీభావం ప్రకటించారు.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల వేతనాలను పెంచాలన్న కేబినెట్‌ నిర్ణయానికి సంబంధించిన ఫైల్‌పై సంతకం చేయడానికి ప్రత్యేక కార్యదర్శి (ప్రాసిక్యూషన్‌) యశ్‌పాల్‌ గార్గ్‌, సుభాష్‌ చంద్రలపై ఆప్‌ ప్రభుత్వం చర్య తీసుకోగా, కేంద్రం దీనిని అడ్డుకుంది. ఢిల్లీ, అండమాన్‌ నికోబార్‌ దీవుల సివిల్‌ సర్వీసెస్‌ (డానిక్స్‌) అధికారులను యుపిఎస్‌సి నిర్వహించే సివిల్‌ సర్వీస్‌ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.

కాబట్టి వీరిపై ఏ చర్య తీసుకోవాలన్నా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. సమ్మెకు వెళ్ళాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వ అధికారులను బిజెపి కావాలనే రెచ్చగొడుతోందని ఆమాద్మీ పార్టీ నాయకులు విమర్శించారు.

Leave a comment