Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

సంక్రాంతికి 2,698 ప్రత్యేక బస్సులు

Published on Jan 01 2016 // News

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల సౌకర్య్ధాం 2,698 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంస్థ ప్రకటించింది. జంట నగరాల నుంచి జనవరి 8 నుంచి 14 వరకు ఈ సర్వీసులను నడపనుంది. హైదరాబాద్‌ జంట నగరాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ తెలిపింది.

ఆర్టీసీని నష్టాల నుంచి లాభాలను తెచ్చేందుకు సంస్థ స్థలాల్లో వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తామని సంస్థ ఎండీ ఎన్‌ సాంబశివరావు అన్నారు. బస్‌ హౌస్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ

సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లల్లో నష్టాలు లేని ఆర్టీసీని చేయాలనే గట్టి నమ్మకంతో ప్రణాళికలను తయారు చేసుకున్నామని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఈ ప్రణాళికను ప్రభుత్వం ముందు ఉంచి రాష్ట్రవ్యాప్తంగా సంస్థకు ఉన్న 1994 ఎకరాల పట్టణ స్థలాలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తామని తెలిపారు.

గత సంవత్సరంతో పోల్చుకుంటే కార్మికులకు ఫిట్‌మెంట్‌ ఇచ్చినా ఈ ఏడాది సంస్థకు రూ.180కోట్లు నష్టాలను తగ్గించామని చెప్పారు.

నవంబర్‌ వరకు సంస్థ రూ.336కోట్ల నష్టాల్లో ఉందన్నారు. పాత బస్సుల స్థానంలో కొంత మేరకు మాత్రమే కొత్త బస్సులను తీసుకొచ్చామని, అనుకున్న స్థాయిలో తీసుకురాలేక పోయామన్నారు.

మరో రెండు నెలల్లో ఆర్టీసీ పరిపాలనా విభాగం పూర్తిస్థాయిలో విజయవాడ నుంచి సాగడానికి సదుపాయాలు కలుగజేస్తామని వివరించారు. 2015లొ రోజుకు ఆర్టీసీ 45లక్షల కి మీ తిరిగిందని, వచ్చే ఏడాది రోజుకు 50లక్షలు కిమీ తిప్పాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామన్నారు.

దీనివల్ల రూ.350కోట్లు ఆదాయం పెరుగుతుందని వెల్లడించారు. పాత అప్పులు ఉండటం వల్ల ప్రతిసారి నష్టాలు అనే పేరు వినపడుతుందన్నారు. అప్పులను లేకుండా ఏ రకంగా చేయాలనేదే తమ ముందు ఉన్న పెద్ద సవాల్‌గా చెప్పారు.

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆర్టీసీ ప్రమాదాలు కూడా తగ్గాయని, ఇవి కూడా జరగకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆక్యూపెన్సీ కూడా 1శాతం పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో 13 జిల్లా కేంద్రాల్లో బస్టాండ్లను ఆధునీకరణ చేయడానికి రూ.52కోట్లు ఖర్చుపెట్టామన్నారు.

సంస్థను లాభాల బాటా పట్టించేందుకు కార్గో సర్వీస్‌ను ప్రారంభించాలని ప్రతిపాదన ఉందని, మరో 3 నెలల్లో ప్రారంభిస్తామన్నారు. బస్‌స్టేషన్లలో మెడికల్‌ షాపు సర్వీస్‌ కోసం అపోలో మెడికల్‌ సర్వీస్‌, మెడ్‌ప్లస్‌ ఇచ్చామని తెలిపారు.

సంక్రాంతికి కొత్తగా 45 ఎసి బస్సులను సీఎం చేతుల మీదగా ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పారు. వీటిల్లో 15 స్కానియా బస్సులు ఉన్నాయని వీటికి అమరావతి పేరు మీదగా ప్రారంభించాలని ఆలోచిస్తున్నామన్నారు.

ఎసి బస్సులకు సర్వీస్‌ పెంచాలనే ఆలోచనతో ఉన్నామన్నారు. 2016లో రూ.100కోట్లతో 500 బస్సులను కోనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

Leave a comment