Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

ఇరాన్‌పై అమెరికా తీవ్ర అస‌హ‌నం

Published on Jan 01 2016 // National

ఇరాన్‌ నిర్వహిస్తున్న బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న అమెరికా ఆ దేశంపై తాజా ఆంక్షలతో మరోసారి కాలుదువ్వేందుకు సిద్ధమవుతోంది.

ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమంలో భాగస్వాములుగా వున్న 12 కంపెనీలతో పాటు ఇరాన్‌, హాంకాంగ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన కొంత మంది వ్యక్తులపై ఆంక్షలు విధించేందుకు అమెరికాలోని ఒబామా ప్రభుత్వం సిద్ధమవుతోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన తాజా సంచికలో ప్రచురితమైన వార్తా కథనంలో వెల్లడించింది.

గత జులైలో ఇరాన్‌ ఆరుదేశాలతో కుదుర్చుకున్న అణు ఒప్పందంలోని షరతుల ప్రకారం క్షిపణి కార్యక్రమంలో ప్రమేయం వున్న ఇరాన్‌ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు అమెరికా ఆర్థిక శాఖకు అధికారం వున్నదని ఈ పత్రిక తెలిపింది.

అయితే ఇటువంటి ఆంక్షలన్నీ అణుఒప్పందాన్ని ఉల్లంఘించటమేనని తమ సుప్రీం అధినేత ఆయతుల్లాఖొమైనీ భావిస్తున్నారని ఇరాన్‌ అధికారులు చెబుతున్నారు.

ఇరాన్‌ క్షిపణి కార్యక్రమాలపై అదనపు ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, అయితే దీనిపై తాము కొంత కాలం వేచి చూస్తామని అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు వివరించారు.

తమ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని ఇరాన్‌ క్షిపణి కార్యక్రమాన్ని నిలుపు చేయించేందుకు ఆంక్షల విధింపుతో పాటు దౌత్యపరమైన ప్రయత్నాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు.

ఐరాస భద్రతా మండలి తీర్మానానికి వ్యతిరేకంగా ఇరాన్‌ గత అక్టోబర్‌ 10న అణ్వస్త్ర వాహక సామర్ధ్యం కలిగిన మీడియం రేంజ్‌ ఎమాద్‌ రాకెట్‌ను ప్రయోగించినట్లు ఐరాస ఆంక్షల పరిశీలకుల బృందం తమ రహస్య నివేదికలో పేర్కొన్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ క్షిపణి ప్రయోగ కార్యక్రమంలో ప్రమేయం వున్న వ్యక్తులు, ఇరాన్‌ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టటంతో పాటు అదనపు ఆంక్షలను అమలు చేసే అంశాన్ని ఆంక్షల కమిటీ పరిశీలిస్తున్నదని దౌత్యవేత్తలు చెబుతున్నారు. కాగా తాము ప్రయోగించిన ఎమాద్‌ రాకెట్‌ అణ్వస్త్ర వాహక సామర్ధ్యం కలిగి వున్నదన్న పశ్చిమదేశాల అంచనాలతో ఇరాన్‌ విభేదిస్తోంది.

Leave a comment