Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

భారతీయుడికి మరణశిక్ష క్షమాభిక్షకు ససేమిరా

Published on Dec 30 2015 // National

ప్రేమించి పెళ్లి చేసుకుని, విదేశాలకు తీసుకెళ్లి, ఆపై తన భార్యను దారుణంగా హత్య చేసిన నేరానికి ముంబయికి చెందిన ఆతిఫ్ పొపీరే అనే యువకుడికి దుబాయి కోర్టు మరణ శిక్ష విధించింది.

అతన్ని తుపాకులతో కాల్చి చంపాలని ఆదేశించింది. 2013లో హత్య జరుగగా, తనకు పెట్టాలని ఆతిఫ్ చేసుకున్న దరఖాస్తున్న దుబాయ్ అత్యున్నత న్యాయస్థానం గత వారంలో తిరస్కరించింది.

ఇక చావును తప్పించుకునేందుకు ఆతిఫ్ ముందు ఉన్న ఒకే ఒక్క దారి… బాధితుల కుటుంబీకుల నుంచి క్షమాభిక్ష. అయితే, ఆతిఫ్ భార్య బస్రా తల్లి ఉమా ధనుంజయన్ మాత్రం అది జరిగే పని కాదని స్పష్టం చేశారు. క్షమాభిక్ష కావాలని తననెవరూ సంప్రదించలేదని, ఒకవేళ వచ్చినా తాను అంగీకరించబోనని వెల్లడించారు.

కాగా, ఉమ కుమార్తె మినీ ధనుంజయన్, ముంబయిలోని మాతుంగా కాలేజీలో చదువుతున్న సమయంలో ఆతిఫ్ పరిచయం అయ్యాడు. ఆపై వారు ప్రేమించుకుని, 2008లో పెళ్లి చేసుకోగా, మినీ తన పేరును బస్రాగా మార్చుకుంది.

దుబాయిలోని ఓ షాపులో మేనేజర్‌గా ఉద్యోగం రావడంతో ఆతిఫ్ తొలుత, ఆపై రెండేళ్లకు బస్రా దుబాయి వెళ్లింది. జీవితాంతమూ కలిసుంటాడని నమ్మిన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ‘నా కుమార్తె మరణం తరువాత, అతను ఎలా శిక్షింపబడతాడో చూసేందుకు మాత్రమే నేను బతికున్నాను. అతనికి మరణమే సరైన శిక్ష’ అని ఉమ ఆగ్రహంతో చెబుతున్నారు.

Leave a comment