Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

అట్ట‌హ‌సంగ సీపీఐ జాతీయ ప్లీన‌రీ

Published on Dec 30 2015 // Politics

సీపీఐ(ఎం) జాతీయ ప్లీనంలో నిర్మాణ నివేదిక ముసాయిదాపై మంగళవారం చర్చలు కొనసాగాయి. దీనిపై సోమవారం నాడు 19 మంది ప్రతినిధులు చర్చించగా, రెండో రోజున మరో 10 మంది ప్రతినిధులు చర్చించారు. నిర్మాణ నివేదికపై చర్చ బుధవారం కూడా కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాగా, ‘మహత్తర అక్టోబర్‌ సోషలిస్టు విప్లవం శత వార్షికోత్సవాల’పై ఒక ప్రత్యేక తీర్మానం ప్లీనంలో ప్రవేశపెట్టారు. ఈ ముసాయిదా తీర్మానాన్ని ఎంఏ బేబీ ప్రతిపాదించగా, ఆర్‌ అరుణ్‌కుమార్‌ బలపర్చారు.

ఈ తీర్మానం పూర్తి పాఠం ఇది:
పార్టీ 21వ కాంగ్రెస్‌ తీర్మానించిన విధంగా రష్యన్‌ విప్లవ వందేండ్ల ఉత్సవాలను సంవత్సరం పొడవునా జరపాలని ఈ ప్లీనం పునరుద్ఘాటిస్తున్నది.

2016 నవంబర్‌ 7న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల సందర్భంగా రాజకీయ, భావజాల, సాంస్కృతిక రంగాలలో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, సోషలిజం గురించి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ప్లీనం తీర్మానిస్తోంది.

మానవ చరిత్రలో తొలిసారిగా కార్మికవర్గ రాజ్యాన్ని ఏర్పాటు
చేయడం ద్వారా మహత్తర అక్టోబర్‌ సోషలిస్టు విప్లవం మార్క్సిజం-లెనినిజాన్ని తిరుగులేని విధంగా నిరూపించింది.

అమరులు లెనిన్‌, బోల్షివిక్‌ పార్టీల నాయకత్వంలో సాగిన ఈ విప్లవం కార్మికవర్గ నాయకత్వంలో ప్రజలు పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థను కూలదొయ్యడం సాధ్యమేనని నిరూపిం చింది.

మార్క్స్‌ విశ్లేషణ అక్షర సత్యమని కూడా నిరూపిం చింది. ‘నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట విశ్లేషణ’ అనేది మార్క్సిజం- లెనినిజం సిద్ధాంతపు సారాంశం. ఈ సృజనాత్మక శాస్త్రపు అన్వయింపునకు అక్టోబర్‌ విప్లవం శాశ్వత నమూనాగా నిలుస్తుంది.

ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి అక్టోబర్‌ విప్లవం అనేక ముఖ్యమైన పాఠాలను అందిస్తూ ఉంటుంది. కార్మిక-కర్షక ఐక్యత ప్రాముఖ్యతను ఈ విప్లవం నొక్కి చెబుతుంది. కేంద్రీకృత ప్రజాస్వామ్యం, కార్మికవర్గ క్రమశిక్షణ, ప్రజారాశులతో సజీవ సంబంధాలతో పదునెక్కిన అగ్రగామి పార్టీ అనివార్య పాత్రనూ ఈ విప్లవం చాటి చెబుతుంది.
చరిత్రలో అక్టోబర్‌ విప్లవం అద్భుత విజయాలు సాధించింది. రష్యాలో సోషలిజాన్ని స్థాపించడం ద్వారా ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడాన్ని నిర్మూలించింది. కూడు, గూడు, బట్ట వంటి మానవుల మౌలిక అవసరాలకు గ్యారంటీ ఇచ్చింది.

పుట్టిన పసికందుల నుంచి మృత్యువును సమీపించిన వృద్ధుల దాకా పౌరులందరికీ సంరక్షణ కల్పించడం ద్వారా మానవ జీవితాన్ని సుసంపన్నం చేసింది. నిరక్షరాస్యతను సంపూర్ణంగా నిర్మూలించింది. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చేసింది. మహిళలను ఇంటి చాకిరీ నుంచి చాలా వరకు విముక్తి చేసింది.

వారికి సమాన హక్కులు కల్పించింది. చాలా పెట్టుబడిదారీ దేశాలకన్నా ఎంతో ముందుగానే అది మహిళలకు రాజకీయ ప్రక్రియలో సమాన భాగస్వామ్యం కల్పించింది. తద్వారా వారు ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషించే అవకాశం కల్పించింది. కార్మికుల హక్కులను కాపాడింది. వారికి నిర్వహణలో భాగస్వామ్యం కల్పించింది.

పని పరిస్థితులను మెరుగుపర్చింది. వారికి తగినంత విశ్రాంతి లభించేలా చేసింది. రిటైర్మెంట్‌ తర్వాత మెరుగైన భవిష్యత్తుకు హామీ ఇచ్చింది. సమాజ సంక్షేమం కోసం శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించింది. అధునాతన సార్వత్రిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్లీనం మొట్టమొదటి సోషలిస్టు రాజ్యం సాధించిన మరెన్నో విజయాలను ప్రచారం చేయాలని తీర్మానిస్తూనే, సోషలిస్టు నిర్మాణ క్రమంలో అనేక పొరపాట్లు కూడా జరిగాయని గుర్తిస్తుంది.

ఆ పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడానికి పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
నేటి పరిస్థితుల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకవైపు మార్క్సిజం ప్రాసంగికతతో పాటు సోషలిజం అవగాహనపైనే తీవ్రంగా దాడి జరుగుతోంది. అనేక తూర్పు యూరోప్‌ దేశాలలో కమ్యూనిస్టు పార్టీలను నిషేధించే ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఆఖరుకు కమ్యూనిస్టు యుగానికి సంబంధించిన చిహ్నాల వాడకంపై సైతం ఆంక్షలు విధిస్తున్నారు. చరిత్రకు తప్పుడు భాష్యం చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మునుపటి సోషలిస్టు దేశాలు సాధించిన అసంఖ్యాకమైన విజయాలను తోసిపుచ్చుతున్నారు. ఆఖరుకు సోషలిజాన్ని ఫాసిజంతో, నాజీయిజంతో సరిపోల్చే దుష్ట పన్నాగాలు సైతం సాగుతున్నాయి.

*మార్క్సిజం-లెనినిజానికి దృఢంగా కట్టుబడిన వారిగా మనం ఈ దుష్ప్రచార క్యాంపెయన్‌ను ఓడించడానికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలి. మానవజాతికి దోపిడీ, పీడనలకు తావులేని, పర్యావరణ వినాశనం లేని, నిజమైన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు హామీగా నిలిచే ప్రపంచం కావా లంటే అందుకు సోషలిజమే ఏకైక మార్గమని నొక్కి చెప్పాలి. సోషలిజం అనేది ఊహాజనిత స్వప్నం కాదని, సాకారం చెందాల్సిన ఆవశ్యకత అని రుజువు చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది.

* మహత్తర అక్టోబర్‌ సోషలిస్టు విప్లవ శత వార్షికోత్సవాల సందర్భంగా, యావత్‌ పార్టీ శ్రేణులకు బోధన గరపడంతో పాటు, దేశవ్యాప్తంగా మేధావులను, సాహితీవేత్తలను, సానుభూతిపరులను, వామపక్ష శ్రేయోభిలాషులను కూడగట్టి చర్చాగోష్ఠులు, సెమినార్లు, సింపోజియంలు, ప్రదర్శనశాలలు, ఇంకా అనేక రూపాల్లో కార్యక్రమాలను చేపట్టాలని, మహత్తర అక్టోబర్‌ సోషలిస్టు విప్లవం చేసిన ఈ కింది దోహదాలను ప్రచారం చేయాలని సీపీఐ(ఎం) ప్లీనం తీర్మానిస్తోంది –

* అది భారత జాతీయ ఉద్యమాన్ని ప్రభావితం చేసింది. భగత్‌సింగ్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, ముజఫర్‌ అహ్మద్‌ తదితర అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులపై ఈ విప్లవ ప్రభావం ఉంది. రవీంద్రనాథ్‌ టాగోర్‌ వంటి జాతీయవాద కవులను, పెరియార్‌ తదితర సామాజిక కార్యకర్తలను ఈ విప్లవం ప్రభావితం చేసింది. ఇంకా అనేక మంది ప్రజలు ఈ విప్లవ భావజాలంతో ప్రభావితం కావడం వల్లనే వారు కమ్యూనిస్టు పార్టీ సహా వేర్వేరు వర్గ , ప్రజా సంస్థలను ఏర్పాటు చేసుకోగలిగారు. స్వాతంత్య్రోద్యమంలో అంతర్భాగంగా సోషలిస్టు ప్రవాహం కూడా కొనసాగింది.

* అది ఫాసిజాన్ని ఓడించింది. రష్యా ఎర్రసైన్యం 1945, మే 9న రీచ్‌స్టాగ్‌పై ఎర్రజెండాను ఎగురవేసి ప్రపంచంలో సుస్థిర శాంతికి బాటలు వేసింది.

* ప్రపంచంలో వివిధ జాతీయ విముక్తి ఉద్యమాలకు బాహాటంగా మద్దతునిచ్చింది. తద్వారా ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని వివిధ దేశాలు స్వాతంత్య్రం సాధించుకోగ లిగాయి. నయావలసవాద విధానాల ద్వారా జాతీయ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని సామ్రాజ్యవాదులు ప్రయత్నించినప్పుడల్లా అది అడ్డుగోడగా నిలబడింది. తద్వారా ప్రపంచంలో వలసవాదం అంతరించింది.

* విజ్ఞాన, సాంకేతిక రంగాలను పురోగమింపజేసింది. మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ‘స్పుత్నిక్‌’ను, మొదటి వ్యోమగామి యూరీ గగారిన్‌ను అంతరిక్షంలోకి పంపిం చడం ద్వారా తర్వాతి కాలంలో అధునాతన కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల అభివృద్ధికి బాటలు వేసింది. భూగోళాన్నీ, పరిసర వాతావరణాన్నీ, మరెన్నో ప్రాంతాలనూ లోతుగా అధ్యయనం చేసేందుకు అవకాశాలు కల్పించింది.

* కళలు, గానం, సంగీతం, నాటకాలు, సినిమా, పెయిం టింగ్‌, సాహిత్య వంటి సృజనాత్మక రంగాలను అభిజాత్య వర్గాల పట్టులోంచి తప్పించి వాటిని అభివృద్ధి చేసింది.

2017, అక్టోబర్‌ 7న, అక్టోబర్‌ విప్లవ శత వార్షికోత్సవాల ముగింపు రోజున దేశవ్యాప్తంగా మతతత్వం, ప్రతిఘాతుకత్వం, విచ్ఛిన్నకర, విభజనవాద భావజాలాల ప్రమాదాన్ని ఎండగట్టాలి. కార్మిక-కర్షక ఐక్యతా పునాదిపై శ్రామిక వర్గాలన్నింటి ఐక్యతను ముందుకు తీసుకుపోవడానికి పునరంకితం కావాలి.

మహత్తర అక్టోబర్‌ సోషలిస్టు విప్లవం 100వ వార్షికోత్సవాన్ని గొప్పగా నిర్వహించాలని ఈ ప్లీనం తీర్మానిస్తున్నది. మార్క్సిజం-లెనినిజం పట్ల తన అచంచల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నది. మానవజాతికీ, ప్రపంచానికీ భవిష్యత్తు సోషలిజంలోనే ఉందని ప్రకటిస్తున్నది.

Leave a comment