Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

నటుడు పొట్టి రాంబాబు కన్నుమూత

Published on Dec 30 2015 // News

హాస్య నటుడు పొట్టి రాంబాబు(35) మంగళవారం బ్రెయిన్‌ ట్యూమర్‌తో కన్నుమూశారు. రెండు రోజుల క్రితం తీవ్ర తలనొప్పి రావడంతో హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లో తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.

చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు కుమారుడు, కుమార్తె, భార్య ఉన్నారు. తన 13ఏళ్ల సినీ జీవితంలో 120కి పైగా చిత్రాల్లో నటించారు. ‘ఈశ్వర్‌’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. తర్వాత చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన రాంబాబు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టపడేవారు. చిన్నతనంలోనే తన తండ్రి చనిపోవడంతో తల్లి సంరక్షణలోనే ఈయన పెరిగారు. చిన్నప్పటి నుంచి తన చుట్టు పక్కల గ్రామాల్లో నాటకాలు వేసేవారు.

ఎక్కడ నాటకం వేసినా పొట్టి వ్యక్తి చేసే పాత్ర మాత్రం కచ్చితంగా ఈయనే చేసేవారు. ఒకసారి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఓ నాటకం వేశారు. ఆ నాటకంలో ఆయన చేసిన పెర్‌ఫార్మెన్స్‌ను విజయచందర్‌ మెచ్చుకున్నారు. సినిమాల్లో అవకాశాలు వస్తాయని అప్పట్లోనే ఆయన అన్నారు.

2002లో ప్రభాస్‌ చిత్రం ‘ఈశ్వర్‌’లో తొలిసారిగా నటించారు. తర్వాత చేసిన ‘చంటిగాడు’ చిత్రంలో చేసిన పాత్ర గుర్తింపునిచ్చింది. ఇప్పటి వరకు చిన్న చితకాపాత్రలు 120కి పైగా సినిమాల్లో నటించారు.

నెరవేరని కలపొట్టి రాంబాబుకు చిన్నప్పటి నుంచి హీరో కావాలనేది కల.

దీని కోసం ‘పులిరాజు ఐపీఎస్‌’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ సగం పూర్తయింది. ఇందులో ఆయనకు తండ్రిగా ఎమ్మెస్‌ నారాయణ చేశారు. ఈ చిత్రం పూర్తయితే ఈయనకు హీరో అవ్వలన్నా కల నెరవేరేది. అది నెరవేరకుండా కన్నుమూశారు. ఈయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.

Leave a comment