Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

అమ‌రావ‌తి నిర్మాణం జ‌రుగుతుందిలా..!

Published on Dec 29 2015 // News

అమ‌రావ‌తి రాజధానిలోని 25 గ్రామాలను క్రమపద్ధతిలో మార్చనున్నారు. వాటి విస్తీర్ణాన్ని ఒక్కో చదరపు కిలోమీటరు ప్రాతిపదికగా మార్చనున్నారు. ఆ 25 రెవెన్యూ గ్రామాలనే నగరాలుగా మార్చాలని ప్రతిపాదించారు. ప్రతి నగరంలోనూ 60 వేల నుండి లక్ష మంది జనాభాకు అంచనా వేస్తున్నారు.

ఎంఆర్‌టి (మాస్‌ రాపిడ్‌ ట్రానిట్‌), బిఆర్‌టి (బస్‌ రాపిడ్‌ ట్రానిట్‌) కారిడార్‌ నిర్మించనున్నారు. నగరం మధ్యలో టౌన్‌పార్కు, స్పోర్ట్స్‌, హెల్త్‌, సమ్మిళిత వినియోగప్రాంతం, ప్రతి సిటీలోనూ ఒక విద్యుత్తు దహన వాటికను ఏర్పాటు చేస్తున్నారు.

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌, పౌర సదుపాయాల కేంద్రం, ఒకే ప్రాంతంలో దేవాలయాలు కట్టుకునే విధంగా స్థలాలను కేటాయించనున్నారు. నాలుగు నైబర్‌హుడ్‌ పార్కులు ఏర్పాటు చేస్తారు. ప్రతి నగరంలోనూ 16 ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. నాలుగు సెకండరీ పాఠశాలలు, ఒక జూనియర్‌ కాలేజీని నిర్మించనున్నారు.

వర్షపు నీటి కాలువలు రెండు నిర్మిస్తారు. ఆరు చోట్ల బిఆర్‌టి స్టాపులను ఏర్పాటు చేయనున్నారు. దీంట్లోనూ రెండు రకాల ప్లాన్లను ప్రతిపాదించారు. అవసరాన్ని బట్టి ఏది అమలు చేయాలనుకుంటే దాన్ని అమలు చేస్తారు. ఎంఆర్‌టి, బిఆర్‌టి కారిడార్‌కు అనుకుని ఎక్కువ జన సాంద్రత ఉండే విధ ంగా నివాసాలను ఏర్పాటు చేయనున్నారు.

పారిశ్రామిక ప్రాంతంలోనూ చదరపు కిలోమీటరు పద్ధతినే అనుసరిస్తున్నప్పటికీ దానిలో ఈశాన్య, నైరుతి మూలల్లో నివాస ప్రాంతాలను, మధ్యలో సదుపాయాల కేంద్రాన్ని చూపారు.

రవాణాకు సంబంధించి ఉండవల్లి కొండకు నిర్మించనున్న టన్నెల్‌ను అద్భుత ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. ఉద్దండ్రాయునిపాలెం లంకలో అమరావతి వాటర్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. భూములిచ్చిన రైతు లకు ఆయా నగరాల చుట్టూ ప్లాట్లు కేటాయిస్తామని తెలిపారు.

పర్యాటకానికి పెద్దపీట
రాజధాని పర్యాటకంలో హెరిటేజ్‌ టూరిజం కింద కొండపల్లి, గాంధీహిల్‌, మొఘల్రాజపురం గుహలు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి కోట, కొండవీడు, భట్టిప్రోలును మార్చనున్నారు. భవానీ ద్వీపాన్ని సహజ పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేస్తున్నారు.

అమరావతి, ఇంద్రకీలాద్రి, మంగళగిరి, నల్లపాడు, శ్రీకాకుళం, మోపిదేవి, వేదాద్రి, పెదకళ్లేపల్లి, పాండురంగస్వామి దేవస్థానాలను మతపరమైన పర్యాటక ప్రాంతాలుగా మార్చనున్నారు. విజయవాడ నగరం రాజధాని వినోద ప్రాంతంగా మారనుంది. నందిగామ, నూజివీడు, సత్తెనపల్లి, గన్నవరం, గుడివాడను వేగంగా అభివృద్ధి చెందే పారిశ్రామిక ప్రాంతాల్లో చేర్చారు.

గన్ననరం, మంగళగిరి, తెనాలి, గుంటూరు, గుడివాడ, నందిగామలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఏలూరు నుండి చిలకలూరిపేట వరకూ, నందిగామ నుండి మచిలీపట్నం వరకూ ప్రత్యేక అభివృద్ధి కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. గుడివాడ మీదుగా బాపట్ల వరకూ ప్రత్యేకంగా వస్తు రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు.

25 మురుగునీటి ట్రంకు లైన్లు
మురుగునీటి శుద్ధి కోసం మూడు ఎస్‌టిపిలను ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో ఒకటి నవులూరు పరిధిలో మరొకటి మంగళగిరి దక్షిణ భాగంలో జాతీయ రహదారి దగ్గరల్లో మూడోది తుళ్లూరు చెరువులో ఒకటి ఏర్పాటు చేయనున్నారు.

మురుగునీటి కోసం 25 ప్రధాన ట్రంకులైన్లను ఏర్పాటు చేయనున్నారు. చెత్తను తరలించేందుకు తుళ్లూరులో ఒకటి, నవులూరులో మరొకటి ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్‌ సరఫరాకు ఏడు హైటెన్షన్‌ విద్యుత్‌లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు మాస్టర్‌ప్లాను నోటిఫికేషన్లో ప్రస్తావించారు. ప్రస్తుతం ఇవి రాజధాని నగరంలో నిర్మించేవున్నాయి.

మార్గాలు ఇలా…
ప్రతి ప్రాంతంలోనూ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుకుని రెండు ఆర్టిరియల్‌ రోడ్లను తూర్పు, పడమర దిశలుగా ఏర్పాటు చేయనున్నారు. వీటిి మధ్యలో ఉత్తర దక్షిణ దిశల్లో రెండు సబ్‌ ఆర్టిరియల్‌ రోడ్లుంటాయి. వీటికి సమానంగా రెండు లోకల్‌ రోడ్లను ఏర్పాటు చేస్తారు. పారిశ్రామిక ప్రాంతంలో రెండు ఆర్టీరియల్‌, సబ్‌ ఆర్టిరియల్‌ రోడ్లు నిర్మించి మధ్యలో అనుసంధాన మార్గాలు నిర్మిస్తారు.

ఎంఆర్‌టికి కిలోమీటరుకు 40 మిలియన్‌ డాలర్లు
రాజధాని నగరంలో నిర్మించే రోడ్లలో బిఆర్‌టి రోడ్డులో 27 నుండి 48 కిలోమీటర్ల వేగం, ఎల్‌ఆర్‌టిలో 50 నుండి 70 కిలోమీటర్ల వేగం, ఎంఆర్‌టిలో 50 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా ఏర్పాటు చేశారు. వాటి నిర్మాణానికయ్యే ఖర్చునూ పొందుపరిచారు.

దీనిలో బిఆర్‌టికి ఒక కిలోమీటరుకు ఒకటి నుండి రెండు మిలియన్ల యుఎస్‌ డాలర్లు, ఎల్‌ఆర్‌టికి ఐదు నుండి పది మిలియన్‌ డాలర్లు, ఎంఆర్‌టికి 20 నుండి 40 మిలియన్‌ డాలర్లు అవసరమవుతాయని అంచనా వేశారు. మొత్తం నాలుగులైన్ల ఎంఆర్‌టిని ఏర్పాటు చేయనున్నారు.

దీనిలో తొలిలైను 26.22 కిలోమీటర్లు, రెండోలైను 31.06 కిలోమీటర్లు, మూడోలైను 25.32 కిలోమీటర్లు, నాలుగోలైను 25.57 కిలోమీటర్లు ఉంటుంది. జాతీయ రహదారికి అనుసంధానంగా హైస్పీడు రైలు కారిడార్‌ ఏర్పాటు చేస్తారు. విజయవాడ గుంటూరు మధ్య సబర్బన్‌ రైళ్లను తిప్పనున్నారు. మొత్తం 13 చోట్ల ఎంఆర్‌టి ఇంటర్‌ ఛేంజ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు.

మద్దూరు రిజర్వాయర్‌ నుండి రాజధాని నగరానికి నీటి సరఫరాను చేయనున్నారు. మొత్తం రాజధానికి నీటిని అందిస్తుంది. నీరుకొండ నుండి ప్రభుత్వ కారిడార్‌కు నీటిని సరఫరా చేస్తారు. మూడుచోట్ల వాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. 32 చోట్ల మంచినీటి సరఫరా కేంద్రాలను పెడతారు. వీటిల్లో మొత్తం 630 ఎంఎల్‌డిల నీటిని ట్రీట్‌మెంటు చేయనున్నారు.

మున్సిపాలిటీల విస్తరణ
విజయవాడ గుంటూరు నగరాలు కలిసిపోయే పట్టణ ప్రాంతంగా పేర్కొన్నారు. నూజివీడు, గుడివాడ, తెనాలి, పొన్నూరు, గుంటూరు, నందిగామ, జగ్గయ్యపేట, సత్తెనపల్లి పట్టణాలను మరింత విస్తరించనున్నారు. సత్తెనపల్లి, గుంటూరు నుండి చిలకలూరిపేట మార్గంలో కొండవీడు రేంజ్‌, తెనాలి, గన్నవరం, నూజివీడు, నందిగామ, కొండపల్లి, మంగళగిరి, అనంతరం ప్రాంతాలను పూర్తి పారిశ్రామిక ప్రాంతంగా మార్చారు.

ఏలూరు నుండి గుడివాడ వరకూ ప్రత్యేక అభివృద్ధి కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. క్యాపిటల్‌ సిటీ నుండి గుంటూరు నగరం మధ్యలో ఉన్న ప్రాంతం సహా కృష్ణా జిల్లా కంచికచర్లను భవిష్యత్‌ పట్టణీకరణ ప్రాంతంగా చూపించారు. ఇదంతా అవుటర్‌ రింగురోడ్డు మధ్యలోనే ఉండే విధంగా ప్లానులో పేర్కొన్నారు.

రాజధాని మిగిలిన ప్రాంతమంతా అగ్రికల్చరల్‌ ప్రొటెక్షన్‌ జోన్‌-1గా మార్చారు. గుంటూరు నుండి రాజధానికి పడమట భాగంతోపాటు జగ్గయ్యపేట వరకూ అగ్రికల్చరల్‌ ప్రొటెక్షన్‌ జోన్‌-2గా మార్చారు. ఇబ్రహీంపట్నం, విజయవాడ, మంగళగిరిని మేజర్‌ ట్రాన్సిట్‌హబ్‌గా మార్చనున్నారు. రాజధాని నగరంతోపాటు విజయవాడ, ఇబ్రహీంపట్నం, మంగళగిరిని ఉపాధి కల్పనా కేంద్రాలుగా ప్రస్తావించారు.

విజయవాడ నుండి ఇబ్రహీంపట్నం వరకూ వాటర్‌ఫ్రంట్‌ ఏర్పాటు చేయడంతోపాటు తొమ్మిది ప్రాంతాల్లో ఎకో టూరిజం క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు 25 వాటర్‌ ట్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిల్లో మంగళగిరి, పెనుమాక, నీరుకొండ, అనంతవరం, పెనుమాక కొండలను కీలకమైనవిగా గుర్తించారు.

Leave a comment