Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం వివరాలు ఇవ్వండి – హైకోర్టు

Published on Dec 29 2015 // News

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో లక్షలాదిమంది డిపాజిటర్లను నిలువునా ముంచిన అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ప్రక్రియపై నివేదిక సమర్పించాలని జస్టిస్‌ సూర్యారావు కమిటీని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.

తదుపరి విచారణను ఈ నెల 31 కి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం నుంచి తాము చెల్లించిన డబ్బులను ఇప్పించాలని అభ్యర్థిస్తూ అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌తో పాటు పలువురు బాధితులు దాఖలు చేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలిప్‌ బి బొసలే, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం సోమవారం మరోమారు విచారించింది.

ఈ సందర్భంగా ఆస్తుల వేలంపై కోర్టు నియమించిన జస్టిస్‌ సూర్యారావు కమిటీ న్యాయవాది రవిప్రసాద్‌ వాదిస్తూ, ఆస్తుల వేలానికి అర్హత ఉన్న మూడు కంపెనీలను ఎంపిక చేసినట్లు నివేదించారు.

ఈ కంపెనీల ప్రతినిధులతో పాటు సంబంధిత అధికారులతో ఈ నెల 30న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు నివేదించారు. మూడు కంపెనీలు కోర్టు నిర్దేశించే కమిషన్‌కు ఆస్తులను వేలం వేసేందుకు ముందుకు వచ్చాయని, ఆస్తులు వేలం వేసే బాధ్యతలను త్వరలోనే ఈ కంపెనీలకు అప్పగిస్తామని కోర్టుకు నివేదించారు.

కంపెనీ ప్రతినిధులతో సమావేశమై కార్యాచరణ రూపొందించి వేలం ప్రక్రియను వేగవంతం చేస్తామని విన్నవించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ బొసలే జోక్యం చేసుకుని , డిపాజిటర్లకు నష్టం వచ్చే విధంగా ఎవరూ వ్యవహరించరాదని వ్యాఖ్యా నించారు. నష్టపోయిన బాధితులకు సత్వర న్యాయం జరగాలని, ఆ దిశలోనే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

జస్టిస్‌ సూర్యారావు కమిటీ నిర్దేశించిన మేరకు 0.2 శాతం కమిషన్‌కే ఆస్తులు వేలం వేసేందుకు మూడు కంపెనీలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎంఎస్‌టిసి లిమిటెడ్‌ ( పబ్లిక్‌ సెక్టర్‌ అండర్‌టేకింగ్‌ ), శ్రీరాం ఆటోమొబైల్‌ ఇండియా లిమిటెడ్‌ , ఇ – ప్రొక్యూర్‌ టెక్నాలజికల్‌ లిమిటెడ్‌ కంపెనీలను జస్టిస్‌ సూర్యారావు జస్టిస్‌ కమిటీ ఎంపిక చేసింది.

Leave a comment