Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

పాక్‌లో ఆత్మాహుతి దాడి18 మంది మృతి

Published on Dec 29 2015 // National

పాకిస్థాన్‌ వాయువ్య ప్రాంతంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి మోటార్‌ సైకిల్‌పై వచ్చిన దుండగుడు ఆత్మాహుతి దాడి చేసుకోవడంతో 18 మంది మృతిచెందారు.

మార్దన్‌ ప్రాంతంలోని నేషనల్‌ డేటాబేస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ కార్యాలయం గేటు తోసుకుంటూ రద్దీగా ఉండే కార్యాలయంలోకి మోటార్‌సైకిల్‌పై దూసుకెళ్లి ఆత్మహుతి చేసుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 30మందికి గాయాలయ్యాయి.

కార్యాలయం గేటు వద్ద సెక్యురిటీ సిబ్బంది మోటార్‌ సైకిల్‌ను అడ్డుకొనేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బైక్‌పై వచ్చిన వ్యక్తి బలవంతంగా లోపలికి దూసుకెళ్లాడని పోలీసులు వెల్లడించారు. గేటుకు సమీపంలోనే పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు.

పేలుడు ధాటికి భవనం కిటికీలు, తలుపులు పలుచోట్ల ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a comment