Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

అమరావతి అభివృద్ధికి మైక్రోసాఫ్ట సీఈఓ

Published on Dec 29 2015 // News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మైక్రోసాప్ట్ ఇండి యాల మధ్య కీలక అవగహనా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం, పౌరసేవా రంగాల్లో త్వరితగతిన అభి వృద్ధి సాధించటానికి మైక్రోసాప్ట్ సంస్థ, ఏపీ ప్రభుత్వానికి ఐటీ ఆధారిత సాంకే తిక సహకారమందించనుంది.

అలాగే ఈ ఒప్పందం ద్వారా మైక్రోసాప్ట్ రూపొందించిన మెషిన్ లెర్నింగ్ సాప్ట్‌వేర్‌ను రాష్టంలోని వివిధ శాఖలు వాడు కునే అవకాశం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సోమవారం ఉద యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మైక్రోసాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆయన నివాసంలో కలుసుకున్నారు. గంటా 20 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి.

ఏపీ ప్రభుత్వ అధికారులు, మైక్రోసాప్ట్ సంస్థ ప్రతిని ధులు వీరిద్దరి సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆధునిక విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు ద్వారా, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు మరో సారి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల దృష్టిని ఆకర్షించేందుకు, ఆయనతో మాటా మంతీకి పోటీ పడ్డాయి.

ఇంతకు ముందు ఆయన హైదరాబాద్ వచ్చి వెళ్లే నాటికి రాష్ట్ర విభజన జరగలేదు. సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సత్య నాదెళ్ళను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించారు.

ఆ సందర్భంగా విద్య, ఈ సిటిజన్ సర్వీసులు, వ్యవసాయం వంటి రంగాలతో భాగస్వామ్యానికి ఒప్పందాలు కుదిరాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని నాదెళ్లను చంద్రబాబు కోరినట్లు తెలిసింది. మైక్రోసాఫ్ట్‌కు హైదరాబాద్‌లో పెద్ద క్యాంపస్ ఉన్న విషయం తెలిసిందే.

సోమవారం కుదిరిన ఒప్పందాల మేరకు మైక్రోసాఫ్ట్ మూడు ప్రూఫ్ ఆఫ్ కన్సెప్ట్ సొల్యూషన్స్ నిర్మాణంలోనూ, ఎజూర్ మిషన్ లర్నింగ్ అండ్ అడ్వాన్సుడు విజువలైజేషన్ ల్యాబ్ టెక్నాలజీ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు సహకారమందిస్తుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, మనుమడు దేవాంశ్, నాదెళ్లతో ఫొటోలు తీయించుకున్నారు.

చంద్రబాబు నాయుడుతో సమావేశానంతరం నాదెళ్ల తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అతి పెద్దదిగా ఏర్పాటు చేయదలచిన టీ హబ్, స్టార్ట్ అప్ ఇన్‌క్యుబేటర్‌లను సందర్శించేందుకు వెళ్లారు. ఆయన వెంట ఇన్ఫోసిస్‌కు చెందిన విశాల్ సిక్కా, హ్యూలెట్ పాకార్డ్ గ్రూప్ చెందిన కీర్తి మేల్కోటే అక్కడికి వెళ్లారు.

ఈ సందర్భంగా తెలంగాణలోని చిన్న, పెద్ద పరిశ్రమలకు ఉపయోగపడే క్లౌడ్ ఎనేబుల్‌మెంట్ సేవల గురించి చర్చించామని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. అలాగే తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల డిజిటలైజేషన్ గురించి చర్చించామని మంత్రి తెలిపారు.

కాగా టీ హబ్‌లో నాదెళ్ల, యువ పారిశ్రాామిక వేత్తలతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆయనతో మాట్టాడటం ఎంతో ఉత్తేజకరంగా ఉందిని ఆ పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు. యాక్సిలరేటర్లు, స్టార్ట్ అప్‌ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నాదెళ్ళ ఆసక్తి కనపరచినట్లు తెలిపారు.

‘నాకు శక్తి దేశ దేశాల్లోని పారిశ్రాామిక వేత్తలతో మాట్టాడటం వల్ల వస్తుందని నాదెళ్ళ ఆ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ‘విజయానకి మూడు మార్గాలు కన్సెఫ్ట్, క్యాపబులిటీ, కల్చర్’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

నాదెళ్ల భౌౌగోళికంగా తెలంగాణలో ఉన్న హౖౖెదరాబాద్‌లో పెరిగారు. ఆయన కుటుంబం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌కు చెందినది. గత ఏడాది సెప్టెంబర్‌లో నాదెళ్ల ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. 1998నుంచి ఉన్న ఈ సంస్థ అమెరికాలోని రిచ్‌మండ్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం తర్వాత అతి పెద్దది.

Leave a comment