Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

తెలుగు రాష్ట్రాలపై రాహుల్‌ టీం పావులు

Published on Dec 29 2015 // Politics

దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో ఆ తరువాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తరువాత కాంగ్రెస్ హైకమాండ్ దక్షణాధిపై పట్టుకోసం దృష్టి సారిస్తోంది.

దక్షణాదిన కూడా మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు అండగా నిలిచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికమేనని ఆ పార్టీ హైకమాండ్ పెద్దలు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో దక్షణాధిన ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు సమాచారం. రాహుల్‌గాంధీ నేతృత్వంలోని ప్రత్యేక టీం ఈ రెండు రాష్ట్రాలపైన మున్ముందు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

ఈ రెండు రాష్ట్రాల పార్టీ నాయకత్వాలపై ఎప్పటికప్పుడు ఒత్తిడి పెంచుతూ ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వాలపై పోరాటం చేయించేలా చూడాలని ఏఐసిసి నాయకత్వం భావిస్తోంది.

తద్వారా ఉమ్మడి రాష్ట్రంలో పార్టీకి ఉన్న పూర్వ వైభవం తిరిగి సాధించుకోవాలని సమాలోచనలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అవకాశాలు ఉన్నా అక్కడి పార్టీ నేతల అనైక్యత వల్లే అ«ధికారం చేజరిందని ఏఐసిసి భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే గత కొద్దినెలల కిందటే టి పిసిసి నాయకత్వ మార్పు చేపట్టి కొత్త సారథులను కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అధికారంలో పాగా వేయడంతోపాటు ఇక్కడి నుంచి మెజార్టీ ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

ఇక ఏపి రాష్ట్రంలో పూర్వ వైభవం కాకపోయినా కనీసం ఉనికిని కాపాడుకోవాలని ఏఐసిసి అగచాట్లు పడుతోంది.
నిరంతర సమన్వయం?: ఇరు రాష్ట్రాల పార్టీ నాయకత్వాలతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు నిరంతరం సమన్వయం చేసుకొనేలా ఏఐసిసి నాయకత్వం కార్యచరణను రూపొందిస్తోంది.

ఇద్దంతా మున్ముందు రాహుల్‌గాంధీ పర్యవేక్షణలో జరగనున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వ పగ్గాలు రాహుల్‌గాంధీకి అప్పగించాలన్న డిమాండ్ ఆ పార్టీలో పెరుగుతోంది. కావున మున్ముందు కాంగ్రెస్ పార్టీపై దేశవ్యాప్తంగా రాహుల్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని, తెలుగు రాష్ట్రాలపై ఆయన మరింత శ్రద్దపెడుతున్నారని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలావుంటే ఎప్పటికప్పుడు తన తరపున ఆయా రాష్ట్రాలకు దూతలను పంపడం, పార్టీని క్షేత్రస్థాయి నాయకత్వాల అభిప్రాయాలను సేకరించడం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుకు ప్రోత్సహించడం వంటి వాటిపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారిస్తోంది.

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఏపికి అన్యాయం జరిగిందంటూ, ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాలంటూ, విభజన హాఈలు అమలు చేయాలని ఏపి కాంగ్రెస్ నాయకత్వం ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం ఏపి రాష్ట్ర పునర్విభజన బిల్లులో ఏపికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కోసం చేసిన సిఫార్సులను ఆమోదించాలని కూడా ఏపి కాంగ్రెస్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇలా పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే ఏపి కాంగ్రెస్ నాయకత్వం కూడా దూకుడు పెంచినట్లు సమాచారం. ఇలా ఏపిలో పార్టీ ఉనికిని కాపాడుకోవాలని ఏఐసిసి నాయకత్వం భావిస్తోంది.

తద్వారా ఏపిలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని యోచిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నేతలు సమన్వయంతో కొనసాగకపోవడం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా అధికారంలోకి రాలేకపోయామన్న భావనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది.

టి పిసిసి నాయకత్వం కూడా ఓటమికి ఓ కారణంగా భావించిన ఆ పార్టీ హైకమాండ్ ఇటీవల రాష్ట్ర పార్టీకి కొత్త సారథులను నియమించిన విషయం తెలిసిందే. వారి ద్వారా ఇకపై పార్టీని విస్త్రుతంగా జనంలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది.

పార్టీ నుంచి టిఆర్ఎస్‌లోకి కొనసాగిన ఎమ్మెల్యేల వలసలు, వివిధ ఎన్నికల్లో పార్టీ ఓటమి ఇదంతా పార్టీ నేతల అనైక్యత వల్లే జరిగిందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త సారథుల ఆధ్వర్యంలో పార్టీలో ఉన్న ఆ బలహీనతలను అధిగమించాలని భావిస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీలో నెలకొన్న గ్రూపులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

అసెంబ్లీ లోపల, బయట పార్టీ గళం బలంగా ఉండాలని టి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం సూచనలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీని వచ్చే నాలుగేళ్ల తరువాత అధికార పార్టీగా నిలపడమే ధ్యేయంగా కాంగ్రెస్ హైకమాండ్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ రాష్ట్రంలో కూడా ఏఐసిసి దూతలు నిరంతరం పర్యటించేలా కార్యచరణను కాంగ్రెస్ హైకమాండ్ రూపొందిం చుకొంటోంది. ఇలా నిరంతరం తన దూతలను తెలంగాణ రాష్ట్రానికి పంపడం ద్వారా పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపాలని భావిస్తోంది.

నిస్తేజంగా ఉన్న నేతలు సైతం పార్టీ కార్యక్రమాల్లో విస్త్రుతంగా పాల్గొనేలా చేయాలని సమాలోచనలు చేస్తోంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ తన గత పూర్వ వైభవాన్ని ఇక్కడ తిరిగి సాధించుకోవాలని యోచిస్తోంది.తెలుగు రాష్ట్రాలపై రాహుల్‌ టీం పావులు

నిస్తేజంగా ఉన్న నేతలు సైతం పార్టీ కార్యక్రమాల్లో విస్త్రుతంగా పాల్గొనేలా చేయాలని సమాలోచనలు చేస్తోంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ తన గత పూర్వ వైభవాన్ని ఇక్కడ తిరిగి సాధించుకోవాలని యోచిస్తోంది.

Leave a comment