Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

చండీయాగంలో ఇద్ద‌రు సీఎం.చంద్రులు

Published on Dec 28 2015 // News

తెలంగాణ ముఖ్య మంత్రి కె చంద్రశేఖర రావు కుటుంబం ఎర్రవెల్లిలో నిర్వహిస్తున్న అయుత చండీ మహాయాగానికి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం హాజరయ్యారు. చంద్ర బాబుకు కెసిఆర్‌ సాదర స్వాగతం పలికారు. బాబుకు గులాబీ పుష్పగుచ్ఛం ఇచ్చి యాగశాల వద్దకు తీసు కెళ్లారు.

చంద్రబాబ వెంట కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపి ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తదితరులున్నారు. వీరందరినీ కూడా కెసిఆరే స్వయంగా సాదరంగా ఆహ్వానించారు. టిడిపి నేతలంతా సంప్ర దాయ దుస్తులు ధరించి యాగంలో పాల్గొనడం విశేషం.

విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదం, పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను తీసుకెళ్లిన చంద్రబాబు వాటిని కెసిఆర్‌ చేతుల మీదుగా రుత్వికులకు అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చంద్రబాబును కెసిఆర్‌ సత్కరించారు.
యాగశాలలో మంటలు దిగకుండానే వెనుతిరిగిన రాష్ట్రపతి చివరి రోజైన చండీయాగం వైభవంగా కొనసాగింది.

అయుత మహాచండీ యాగం ముగిసే సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హోమగుండా ల్లో నెయ్యి, హారతి కర్పూర బిల్లలు ఎక్కువ వేయడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి యాగశాల పాకకు అంటుకుంది. ఆ పక్కనే ఉన్న హోమగుండం వద్ద తెలం గాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దంపతులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు.

ప్రాంగణంలోని 75 శాతం మంది భోజనానికి తరలి వెళ్లడంతో పెను ప్రమాదం త ప్పింది. కెసిఆర్‌ దంపతులను భద్రత సిబ్బంది రక్షణ వలయంగా బయటకు తీసుకు వచ్చారు. సకాలంలో ఫైర్‌ ఇంజన్‌ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. అయుత చండీయాగాన్ని 12. 30కే ముగించాల్సి ఉండగా, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వస్తున్నారని కొంచెం వేచివుండాల్సివచ్చింది.

అయితే రాష్ట్ర పతి వచ్చే సమాయానికే యాగశాలలో అగ్నిప్రమాదం జరగడంతో భద్రతాసిబ్బంది సూచనల మేరకు రాష్ట్రపతి దిగకుండానే వెనుదిరిగివెళ్లారు. మంటలను అదుపులోకి తెచ్చాక గవర్నరు నరసింహన్‌ దంపతుల సమక్షంలో పూర్ణహుతి నిర్వహించారు.

Leave a comment