Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

అమెరికన్‌ వర్శిటీల్లో ఇండియాను విద్యార్థుల బందీ

Published on Dec 27 2015 // NRI

అమెరికాలో ఇంజనీరింగ్‌ అంటే 1990 దశకంలో ఒక విధమైన క్రేజ్‌ ఉండేది. అంతేకాకుండా అక్కడ చదివే వారికి అదే స్థాయిలో ప్రతిభ, గౌరవం దక్కేవి. అక్కడ యూనివర్శిటీ, కళాశాలల్లో చదివేవారికి వీసా, పాస్‌పోర్టు వంటి సమస్యలు ఎదురయ్యేవి కావు. అన్నిటిని మించి నాణ్యతలేని, అసలు ఉనికిలో లేని కాలేజీల్లో చదవాల్సిన అవసరమే ఉండేది కాదు.

కానీ గత కొంతకాలంగా అక్కడకెళ్లిన మన విద్యార్థులు పడుతున్న పాట్లు, వీసా ఉన్నప్పటికీ విమానాశ్రయంలోనే నిలిపేస్తున్న సంఘటనలు పరిశీలిస్తే సీను రివర్స్‌ అయినట్లు కనిపిస్తోంది.

దీని వెనక వున్న ప్రధాన కారణాలను విశ్లేషిస్తే బయటకొస్తున్న నిజాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. యూనివర్శిటీ ఆఫ్‌ ల్లైనాయిస్‌ ఇన్‌ అర్బన్‌ ఛాంపైన్‌ (యుఐయుసి), న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌జెఐటి)లు చైనా, భారతీయ విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తుండేవి.

ఈ మధ్య కొత్తగా ఎస్‌వియు, ఎన్‌డబ్ల్యుపిలు పుట్టుకొచ్చాయి. ఈ పేర్లు వినగానే మన దేశంలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ, నల్గొండ- వరంగల్‌ పాలిటెక్నిక్‌ అనుకుంటే పొరపడినట్టే. ఈ సిలికాన్‌ వ్యాలీ యూనివర్శిటీ(ఎస్‌వియు), నార్త్‌ వెస్ట్రన్‌ పాలిటెక్నిక్‌ (ఎన్‌డబ్య్లుపి)లు కేవలం భారతీయ, చైనా విద్యార్థుల దర ఖాస్తులను మాత్రమే స్వీకరిస్తాయి.

ఈ దేశాలకు చెందినవారే వీటికి ప్రిన్సిపాల్స్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు చేసకున్న భారతీయుల్లో సుమారు 5000 మంది దాకా ఆంధ్ర, తెలంగాణాల వాళ్లే ఉన్నారంటే మోసానికి బీజమెక్కడ పడిందో అర్థంచేసుకోవచ్చు.

అస లిక్కడ మోసాలేం జరగలేదనీ, తమ సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చలేదని ఆ యాజమాన్యం చెపుతున్నదాంట్లో ఆవగింజంత కూడా నిజం లేదు. అక్కడ భవనాలు, తరగతి గదులు, ప్రభుత్వ గుర్తింపులన్నీ ఉన్నా అవి చట్టబద్ధంగా సంపాదించినవి కావు. విద్యార్థులకు విద్యనందించడం కాకుండా వారిని వలసదారులగా మార్చడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తున్నాయి.

హైదరాబాదే వారి అడ్డా!
అక్కడ నాణ్యత, ప్రమాణాల్లో లోపాలను సరిచేయా ల్సిన అమెరికా అధికారులు విద్యార్థుల వీసాల రద్దుకు హైదరాబాద్‌ అడ్డాగా జరుగుతున్న నకిలీ ధృవపత్రాల రాకెట్టే కారణమంటున్నారు.

తప్పుడు రాబడి మార్గాలను చూపించి తమదేశానికి వస్తున్నారని అమెరికా అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు. శాన్‌ప్రాన్సిస్కోలో అధికారులు అడ్డుకున్న ఓ విద్యార్థిని సుమారు మూడు గంటలపాటు విచారణ తర్వాతనే వదిలిపెట్టారు.

అసలా కళాశాలల్లో ఏం జరుగుతోంది?
భారత్‌లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత దశా బ్దంలో ఇంజనీరింగ్‌ కళాశాలలు విపరీతంగా పెరి గాయి. ప్రస్తుతం 700 దాకా ఉన్న కాలేజీల్లో ఏటా మూడు లక్ష లకు పైగా విద్యార్థులు బయకొస్తుంటే వారిలో ఉద్యోగానికి ఐదు శాతంమంది కూడా పనికిరావట్లేదు.

దీన్ని గమనించిన కొందరు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోవాల నుకున్నారు. ఆ ప్రయత్నంలోనే స్థానికంగా కొన్ని కన్సల్టెన్సీ లను ఏర్పాటు చేసి ఆఫర్ల ద్వారా విద్యార్థులను ఆకర్షించి వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు.

సంవత్సరానికి 14 లక్షల రుసుముతో సీటు ఇప్పిస్తాయి. జిఆర్‌ఇ, జిమ్యాట్‌ స్కోరు వారికసలు లెక్కే కాదు. కేవలం డబ్బుంటే క్షణాల్లో అన్నీ సమకూరుస్తారు. బోధనా ప్రమాణాలు, అధ్యాపకుల నాణ్యతలపై ఫిర్యాదులున్నా వీరు ఐ-20 లాంటి ధృవపత్రాలు చిటికెలో సృష్టిస్తారు.

చట్టబద్ధమైన ఎఫ్‌-1 వీసాను కూడా అందిస్తారు. వీటితో అమెరికాలో కాలుమోపిన వారికి అక్కడ దౌత్య అధికారులు చుక్కలు చూపిస్తారు. 2-బెడ్‌ రూమ్‌ అద్దె రూ.1,80,000 దాకా ఉండే సిలికాన్‌ వ్యాలీలో కేవలం రూ. 30,000తో బతికేసే విద్యార్ధులున్నారంటే వారి పరిస్థితేంటో ఊహించు కోవచ్చు.

వారానికి మూడు క్లాసులకు మించి జరగక పోవ డంతో చాలామంది చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటు న్నారు. వారిలో అమ్మాయిలు కూడా ఉండటంతో పిల్లల సంరక్షణను సంపాదనగా మార్చు కుంటున్నారు. నిజానికి విద్యార్థి వీసాతో అక్కడ అడుగిడిన వారు ఉద్యోగాలు చేయడం నేరం.

Leave a comment