Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

చలి తీవ్రతకు విలవిలలాడుతున్న జనం

Published on Dec 27 2015 // News

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్ర తలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణరాష్ట్రాల్లో అతిశీతల గాలులు వీయనున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది.
మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని శనివారం వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈనెల 31వరకు అన్ని జిల్లాల్లో అతి శీతల గాలులు వీస్తాయని వారు వివరించారు. ముఖ్యంగా విశాఖ మన్యంలో చలి గాలుల తీవ్రతకు గిరిజనం వణికిపోతున్నారు. శనివారం రాత్రి మినుము లూరులో అత్యంత కనిష్టంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

లంబసింగిలో 7 డిగ్రీలు, పాడేరులో 8, చింతపల్లిలో 9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.అలాగే ఆదిలాబాద్ జిల్లా వాసులూ చలికి గజగజ వణుకుతున్నారు. ఇక్కడ 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణో గ్రత నమోదైంది. ఉట్నూరు ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో చలి విజృంభించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అయితే ఈ ప్రాంతంలోని ఆశ్రమ పాఠశాల్లోని విద్యార్థు లకు వసతులు కరువయ్యాయి.

దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.మరో వారం రోజుల పాటు చలితీవ్రత ఇలానే ఉంటుందని విశాఖ వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో ఈ పరిస్థితి ఉందని పేర్కొంది. ఏజెన్సీలో మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నా యి.

ఒక్కరోజు వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలిగా లులు విజృంభించాయి. గడచిన రెండు రోజుల్లో పాడేరుకు సమీ పంలోని మినుములూరు కాఫీబోర్డు వద్ద 19 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అయితే శుక్రవారం నాటికి ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా తగ్గుముఖం పట్టాయి. మినుములూరు కాఫీ బోర్డులో 14 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడివద్ద 11 డిగ్రీలు, లంబసింగిలో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి.

ఇదిలావుండగా ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. అర్ధరాత్రి నుంచే మంచు తీవ్రత కనిపిస్తోంది. పొగమంచు ఉదయం 10 గంటల వరకు ఉంటుండటంతో మన్యంలో సూర్యోదయం కూడా ఆలస్యమవు తోంది. పాడేరు పట్టణంలో ఉదయం 10.30 గంటలకు మంచు తెరలు తొలగి సూర్యకిరణాలు తాకాయి. ఇదే పరిస్థితి చింతపల్లి ప్రాంతంలో కూడా నెలకొంది.

ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు చన్నీళ్ల స్నానం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ నెల ఆఖరున ఆగ్నేయ బంగాళాఖాతం లో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు వెల్లడిస్తునానరు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త పెరగను న్నాయి. దీంతో చలి నుంచి కొంత ఉపశమనం లభించనుంది. ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అల్పపీడనం వల్ల ఆకాశంలో మేఘాలు ఆవరిస్తాయని, ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గుతుందని విశాఖలోని తుపాను హెచ్చరిక చేసింది. అల్పపీడ నం ప్రభావం ముఖ్యంగా దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమపై కనిపి స్తుందన్నారు. అయినప్పటికీ మేఘాలు ఆవరించడం వల్ల తెలం గాణ, కోస్తాంధ్రల్లో ఇప్పటికన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతా యని వివరించారు.

అలాగే ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలుల వల్ల తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో చలిగాలులు అధికంగా వీచే అవకాశ ముందని భారత వాతావరణ విభాగం ఓ బులెటిన్‌లో తెలిపింది.

అదే సమయంలో ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమల్లో అక్కడ క్కడ తేలికపాటి జల్లులు కురవవచ్చని పేర్కొంది. గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో సాధారణంకంటే 3 డిగ్రీలు, తెలంగాణలో 4 డిగ్రీలు తక్కువగా, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు అధి కంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా చూస్తే.. గడచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా 7.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మెదక్ జిల్లాలో 11, వరంగల్‌లో 14.1, కరీంనగర్ 12.1, నిజామాబాద్‌లో 13.7, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లాల్లో 14.7, ఖమ్మం జిల్లాలో 14.8, నల్లగొండ జిల్లాలో 15.4, మహబూబ్‌నగర్ జిల్లాలో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక విశాఖ ఏజెన్సీలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. వచ్చే 24 గంటల్లో హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 12 డి గ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

Leave a comment