Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

అసెంబ్లీలోనివాస్త‌వ‌ ఫుటేజ్‌లను చూపండి- చెవిరెడ్డి

Published on Dec 25 2015 // Politics

అసెంబ్లీ శీతాకాల సమావేశా ల్లోని వాస్తవ పుటేజ్‌లను బయటపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిఎం చంద్రబాబు సమక్షంలోనే సభలో టిడిపి సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని అసభ్యపదజాలంతో దూషించారని ఆయన ఆరోపించారు.

అసెంబ్లీలో టిడిపి సభ్యుల మాటలు జగుప్సాకరంగా ఉన్నాయన్నారు. పవిత్ర సభలో వినడానికి వీలులేని భాషలో టిడిపి సభ్యుల తిట్లపురణం సభలో కొనసా గిందన్నారు. చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలు మరింత ధారుణంగా ఉన్నాయన్నారు.

అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియో పుటేజ్‌లను కూడా బయటపెడితే ప్రజలు ఛీ కొడతారన్నారు. టిడిపి సభ్యులు సభలో మాట్లాడిన వీడి యోపుటేజ్‌లను కూడా వెంటనే బహిర్గతం చేయాలని డిమాం డ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాల్సి వస్తే ముందుగా ఆ కేసులు చంద్రబాబుపై పెట్టాల్సి ఉంటుందన్నారు.

పోటీ పెట్టిం చి మరీ చంద్రబాబు తమ పార్టీ వారిపై టిడిపి ఎమ్మెల్యేల చేత తిట్టిస్తున్నారని విమర్శించారు. తలదించుకొనేలా టిడిపి సభ్యులు సభలో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. మా ముందే మా పార్టీ అధ్యక్షుడిని టిడిపి సభ్యుల చేత తిట్టిస్తున్నా రని ఆరోపించారు.

ఇలా వ్యవహరిస్తున్న టిడిపి సభ్యులపై చర్యలేవీ అని ప్రశ్నించారు. టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా నీచంగా మాట్లాడి తిడుతున్న ఆయనపై మాత్రం ఎలాంటి చర్యలు ఉండవన్నారు. మేం మాట్లాడటానికి మైక్ అడిగితే స్పీకర్ మైక్ ఇవ్వరు గానీ అదే టిడిపి సభ్యులు తిట్టపురణం అందుకొన్నా మైక్ కట్ చేయరని విమర్శించారు.

నిష్పక్ష పాతంగా వ్యవహరిస్తారన్న నమ్మకంతోనే నాడు స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నామని ఆయన తెలిపారు. కానీ ఆ నమ్మకానికి భిన్నంగా ఏకపక్షంగా స్పీకర్ వ్యవహరించడం వల్లే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు

Leave a comment