Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

అసెంబ్లీ వీడియో క్లిప్పింగ్‌ల లీకేజీపై గ‌రంగ‌రం

Published on Dec 25 2015 // Politics

శీతాకాల అసెంబ్లీ సమావేశాల క్లిప్పింగులు సోషల్‌ మీడియాలో విడుదల కావడంపై స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సమావేశాలకు సంబంధించిన కామెంట్లు, స్క్రిప్ట్‌, ఫుటేజ్‌ ఎవరికీ ఇవ్వొద్దని అసెంబ్లీ సెక్రటరీకి తాను చెప్పానన్నారు.

ఈ లీకేజీపై విచారణ జరిపేందుకు డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రకటించారు.

రోజా సస్పెన్ష్‌న్‌ కు సంబంధించిన వీడియో ఫుటేజి, విడుదల, ఆమె సస్పెన్ష్‌న్‌, వైఎస్‌ఆర్‌ సిపి తనపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం వంటి ఆంశాలపై మాట్లాడేందుకు గురువారం స్పీకర్‌ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.

వీడియో ఫుటేజ్‌, సెల్‌ ఫోన్లు, ఐ పాడ్‌ల ద్వారా లీకయిందా లేక ఏపద్ధతిలో బయటకు వచ్చిందనేది విచారణ జరిపిస్తామ న్నారు. ఇందుకు ఏర్పాటు చేసే కమిటీలో టిడిపి, వైఎస్‌ఆర్‌ సిపి, బిజెపిలు నామినేట్‌ చేసిన సభ్యులకు స్థానం కల్పిస్తామన్నారు.

రోజాను ఒక ఏడాది సస్పెండ్‌ చేయాలని అధికార పక్షం తరఫు శాసన సభా వ్యవహారాల మంత్రి యనమల ప్రతిపాదించగా తాను ఆమోదించానన్నారు. ఆమెకు ఇచ్చిన శిక్ష ఎక్కువని కొందరు, ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఇంకొందరు అభిప్రాయంతో ఉన్నందున రోజా సస్పెన్షన్‌ వ్యవహారాన్నీ డిప్యూటీ స్పీకర్‌ కమిటీి పరిశీలనకు పంపుతున్నామన్నారు.

ఆకమిటీ సిఫారసుపై ప్రివిలేజ్‌ కమిటీకి పంపుతామన్నారు. ప్రివిలేజ్‌ కమిటీ సభకు చేసే సిఫారసుపై రోజా సస్పెన్షన్‌ కాలపరిమితి పెంచడమా , తగ్గించడమా అనేది ఆధారపడి ఉంటుందన్నారు. బడ్జెట్‌ సమావేశాలలోగా ఈ కమిటీ వ్యవహారం పూర్తవుతుందని చెప్పారు.

రోజాను ఏడాదిపాటు సస్పెండ్‌ చేస్తూ సభ నిర్ణయం తీసుకుందని, ఇందులో స్పీకరుకు ప్రమేయం లేదని, ఆ నిర్ణయంపై పున:సమీక్షలేదని అసెంబ్లీలో ప్రకటించగా, ఇప్పుడు మళ్లీ ఆ వ్యవహారాన్ని ప్రివిలేజ్‌ కమిటీకి పంపిస్తామనడం పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు.

ప్రస్తుతం నియమించిన కమిటీ దీనితో పాటు మరికొన్ని అంశాలను కూడా విచారిస్తుందన్నారు. అసెంబ్లీ ఫుటేజ్‌ ను స్పీకర్‌ బహిర్గతం చేయమని చెప్పారని చీఫ్‌ విప్‌ కాలువ శ్రీనివాసులు చెప్పిన విషయాన్ని కోడెల ఖండించారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. అసెంబ్లీలో 18వ తేదీన జరిగిన మొత్తం ప్రొసీడింగ్స్‌ ఇవ్వవలసిందిగా వైఎస్‌ ఆర్‌ సిపి తనను కోరారని చెప్పారు.

ఆ తర్వాత టిడిపి , బిజెపి కూడా ఇదే విధంగా లేఖలు ఇచ్చాయని, ఈ వ్యవహారంపై తాను నిర్ణయం తీసుకోకముందే సోషల్‌ మీడియాలో రావడం దురదృష్టకరమన్నారు. అందరు ఫ్లోర్‌ లీడర్ల మీటింగ్‌ వేసిన తర్వాతే అన్ని పార్టీల వారికి ఫుటేజ్‌ సిడ లు బుధవారం ఇచ్చామన్నారు. అవి బహిరంగపరుస్తారా లేదా అన్నది వాళ్ల ఇష్టమని స్పీకర్‌ స్పష్టం చేశారు.
ఎవరికి అనుకూలంగా లేకపోతే వారు ఆరోపిస్తారా?

తన 35 ఏళ్ళ రాజకీయ చరిత్ర తెలిసీ ఏ తప్పు చేయలేదన్నారు. స్పీకర్‌ గా తన బాధ్యతల నుంచి వెనక్కి పోలేదన్నారు. తానుఏ పార్టీకీ కొమ్ముకాలేదని అంటూ తనను ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నిక చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎవరికి ప్రయోజనాలు జరగకపోతే వారు ఆరోపిస్తే తానేమి చెప్పలేనన్నారు. గత సభలో కూడా కొందరు సభ్యులు అపాలజీ చెబితే వారిపై చర్యలను వెనుకకు తీసుకున్నామన్నారు.

ప్రస్తుత వ్యవహారంలో కూడా కొందరు తన ముందు పశ్చాత్తాపం వ్యక్తం చేశారని, అన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేమన్నారు. కొన్ని అసంతృప్తులు ఉండవచ్చునని, ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగిన తీరు ఆవేదన కలిగించిందన్నారు.

18వతేదీన ప్రతిపక్ష సభ్యులు కొందరు శృతిమించి పోడియం వద్ద గందరగోళం సృష్టించారని వ్యక్తిగత , రాజకీయ ఆరోపణలతో పాటు అభ్యంతరకమైన బాడీ లాంగ్వేజి ప్రదర్శించారని వివరించారు. చివరకు స్పీకరుపైన కూడా ఆరోపణలు చేశారని సభలో అనార్కీ, క్రమశిక్షణారాహిత్యం ఏర్పడడంతో రోజాకు వ్యతిరేకంగా యనమల సస్పెన్షన్‌ తీర్మానం ప్రతిపాదించారన్నారు.

ధైర్యముంటే వాస్తవ ఫుటేజి విడుదల చేయాలి – వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ధైర్యముంటే సభలో జరిగిన విషయాలకు సంబంధించి వాస్తవ ఫుటేజిని బయటపెట్టాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి సమక్షంలోనే అధికార పార్టీ సభ్యులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అయితే వాటికి సంబంధించిన ఫుటేజిని ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్‌ గురించి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ గురించి టిడిపి సభ్యులు మాట్లాడిన మాటలను స్పీకర్‌ నిష్పక్షపాతంగా విడుదల చేస్తే, ప్రజలు అధికార పార్టీని అసహ్యించుకుంటారన్నారు.

టిడిపి సభ్యురాలు అనిత మాట్లాడిన మాటలు కూడా మీడియాకు విడుదల చేస్తే అసలు విషయాలు అందరికీ తెలుస్తాయన్నారు. అసెంబ్లీ రికార్డుల్లో లేని ఫుటేజి సోషల్‌ మీడియాకు ఎలా వచ్చిందో స్పీకరే చెప్పాలని డిమాండ్‌ చేశారు. అట్రాసిటీ కేసు పెట్టాలంటే ప్రతిపక్ష సభ్యులను తిట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనే ముందుగా ఆ కేసు పెట్టాల్సివస్తుందన్నారు.

టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ గత అసెంబ్లీ సమావేశాల్లో తిడితే, ఆ మాటలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారే కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నిష్పాక్షికంగా వ్యవహరిస్తారనే స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, కానీ ఆయన అలా వ్యవహరించకపోవడం వల్లే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు.

Leave a comment