Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

అజాద్‌ సస్పెన్షన్‌పై సీనియర్ల బేటీ

Published on Dec 25 2015 // Politics

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నల్గురు బిజెపి సీనియర్లు ఇప్పుడు అరుణ్‌ జైట్లీ వర్సెస్‌ కీర్తి అజాద్‌ వివాదంలో జోక్యం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నేతలు అజాద్‌ను కలవాలని, అలాగే ఈ అంశాన్ని పార్టీ వేదికలపై లేవనెత్తాలని నిర్ణయించారు.

ఎల్‌.కె.అద్వానీ, మురళి మనోహర్‌ జోషి, శాంతకుమార్‌, యశ్వంత్‌ సిన్హా ఈ నల్గురు సీనియర్లు గురువారం సమావేశమై దీనిపై చాలా సేపు మంతనాలు సాగించారు. అవినీతి కేసులో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీపై అజాద్‌ ఆరోపణలు చేసిన తర్వాత పార్టీ ఆయనపై సస్పెన్షన్‌ వేటువేసింది. దీనిపై అజాద్‌ బిజెపి సీనియర్‌ నాయకుడు మురళీమనోహర్‌ జోషికి ఫిర్యాదు చేయడంతో ఈ నల్గురు సీనియర్లు రంగంలోకి దిగారు.

కీర్తి అజాద్‌ సస్పెన్షన్‌పై ఎటువంటి వైఖరి తీసుకోవాలనేదానిపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ,దానిని బహిరంగంగా వెల్లడించకుండ పార్టీలో తగిన వేదికపై ప్రస్తావించాలని నిర్ణయించినట్లు శాంతకుమార్‌ తెలిపారు. బీహార్‌ ఎన్నికల తర్వాత వారు ఒక ప్రకటన కూడా చేశారు.

అందులో పార్టీ నాయకత్వాన్ని తీవ్రంగానే విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చీ రాగానే ఈ నల్గురిని పార్టీలో శక్తివంతమైన పార్లమెంటరీ బోర్డు పదవులను నుంచి తొలగించారు. మార్గదర్శక్‌ మండల్‌ అని ఒకటి ఏర్పాటు చేసి దానికి అద్వానీని నాయకునిగా పెట్టారు. ఈ మార్గదర్శక్‌ మండల్‌ ఏర్పాటయ్యాక ఒక్కసారి కూడా సమావేశమైన పాపాన పోలేదు.

మోడీ జోక్యం చేసుకోవాలి : అజాద్‌
ప్రధాని మోడీ తన తరపున జోక్యం చేసుకుని తన సస్పెన్షన్‌కు నిర్దిష్ట కారణాలేంటనేది చెప్పాలని అజాద్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అవినీతిపై తన పోరాటం కానీ వ్యక్తులపై కాదని చెప్పారు. ప్రధాని తన విషయంలో న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు అంతకుముందు విలేకర్లతో మాట్లాడుతూ తెలిపారు

Leave a comment