Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు

Published on Dec 24 2015 // Politics

స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా, పక్షపాతపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సభలో కనీసం మైక్ కూడా ఇవ్వనందుకు నిరసనగా స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి సత్యనారా యణను కలిసి అవిశాస తీర్మానం నోటీసు అందచేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. వైసిపి ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసును పరిశీలి స్తామని అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు. ఇదిలావుంటే గతంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ తొలి సమావేశం నుంచే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీలకు అతీతంగా వ్యవరించాల్సిన స్పీకర్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంకు నోటీసు ఇచ్చిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలతో కలిసి సుజయ కృష్ణ రంగారావు విలేకరులతో మాట్లాడారు. స్పీకర్‌గా కోడెల ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై గంటల తరబడి మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక అవాస్తవాలు మాట్లాడినా సభాపతి వారి కట్టడి చేయలేదన్నారు. గతంలో స్పీకర్ పై అవి శ్వాసం పెట్టాలనుకున్నామని, తన వ్యవహార శైలిని మార్చుకుని సభను సక్ర మంగా నడుపుతారని వెనక్కు తీసుకున్నామని వెల్లడించారు.

తమ ఎమ్మెల్యే రోజాకు ప్రధాన అంశంపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వ కుండా ఆమెపై ఎదురుదాడి చేసి అన్యాయంగా ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారని వాపోయారు. అసెంబ్లీలో నిరసనలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయో చెప్పాల్సిన బాధ్యత స్పీకర్ ఉందన్నారు.

అసెంబ్లీ ప్రాపర్టీ అయిన వీడియోలు సోషల్ మీడియాకు లీకవడం స్పీకర్ వైఫల్యంగానే భావిస్తున్నామన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేందుకు అవసరమైన సంఖ్యా బలం తమ పార్టీకి ఉందని ఆయన తెలిపారు.

Leave a comment