Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

అమెరికాను వీడని ఇస్లామ్‌ఫోబియా

Published on Dec 15 2015 // NRI

ఉగ్రవాదానికి ఇస్లామ్‌ను నిందించవద్దంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసినా, అమెరికన్లను మాత్రం ఇస్లామోఫోబియా వీడటం లేదు.

జార్జియాలో ఒక టీచర్‌ బాంబు కోసం ఒక ముస్లిం విద్యార్ధినిని నిలదీయగా, దక్షిణ కేలిఫోర్నియాలో రెండు మసీదులపై విద్వేష దాడులు జరిగాయి.

తన కుమార్తె బ్యాక్‌ప్యాక్‌లో బాంబు తీసుకువ చ్చిందని ఒక మిడిల్‌ స్కూల్‌ టీచర్‌ అనుమానించి నిలదీ శాడని ఆ విద్యార్ధిని తండ్రి మీడియాకు చెప్పారు.

అయితే ఈ ఘటనపై ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ క్షమాపణ చెప్పారని స్కూల్‌ ప్రతినిధి వివరించారు. జార్జియాలోని షిలో మిడిల్‌ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది.

హిజబ్‌ ధరించి స్కూల్‌కు వెళ్లిన 13 ఏళ్ల తన కుమార్తెను స్కూల్‌ టీచర్‌ ఆపుచేసి ఆమె వెనుక బాంబు వుందేమో చూపాలని నిలదీశాడని ఆ విద్యార్ధిని తండ్రి అబ్దుర్‌ రాజక్‌ ఆదెన్‌ చెప్పారు.

ఈ ఘటనతో తన కుమార్తె తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని, విలపిస్తూ తన వద్దకు వచ్చి చెప్పటంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు తాను స్కూల్‌కు వచ్చానని ఆడెన్‌ వివరించారు.

ఆఫ్రికన్‌ ముస్లింలమైన తాము అమెరికాలో నివశిస్తున్నామని, తాను తన పిల్లలకు ఇతర పిల్లలను ద్వేషించమని కానీ, ఇతరుల కన్నా ఆధికులమన్న భావనను కానీ నేర్పలేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమాచారం తెలుసుకున్న స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వెంటనే ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పారని స్కూల్‌ యాజమాన్య ప్రతినిధి సోలన్‌ రోచ్‌ చెప్పారు.

విద్యార్ధినిని ఉద్దేశించి టీచర్‌ చేసిన వ్యాఖ్య అనుచితమైనదేనని, వారి సంభాషణలు, దర్యాప్తు ఆధారంగా రుజువైందని, అయితే అది దురుద్దేశంతో చేసి వుంటాడని తాము భావించటం లేదని రోచ్‌ చెప్పారు.

ద.కేలిఫోర్నియాలో మసీదులపై దాడులు
గత కొద్ది రోజులుగా ముస్లిం ప్రార్ధనా మందిరాలపై జరుగుతున్న దాడుల్లో భాగంగా కేలిఫోర్నియా దక్షిణ ప్రాంతంలో రెండు మసీదులపై తాజాగా దాడులు జరిగాయి. దీనిపై స్పందించిన అమెరికా ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బిఐ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఆదివారం ఉదయం ప్రార్థనా మందిరా నికి చేరుకున్న భక్తులు అక్కడి భవనంపై స్ప్రేపెయింట్‌తో రాసిన ‘జీసస్‌ ఈజ్‌ది వే’ అన్న నినాదాని ్న చూశారని హాథోర్న్‌ పోలీస్‌ విభాగం ప్రతినిధి క్రిస్టోఫర్‌ పోర్ట్‌ మీడియాకు చెప్పారు.

హథోర్న్‌లోని బైటస్‌ సలామ్‌ మసీదు ప్రహరీగోడపై కూడా జీసస్‌ అన్న నినాదంతో కూడిన పెయింటింగ్‌ కన్పించిందని, ఈ మసీదుకు వెళ్లే మార్గంలో హాండ్‌గ్రెనేడ్‌ వంటి వస్తువు కన్పించిందని పోర్ట్‌ వివరించారు.

అయితే తరువాత దానిని ‘ప్లాస్టిక్‌ బంతి’ అని అధికారులు నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలపై విద్వేషపూరిత నేరాలుగా కేసు నమోదు చేసి ఎఫ్‌బిఐ దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు చెప్పారు.

Leave a comment