Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

అమెరికా స్కూళ్లను టార్గెట్‌ చేసిన ఐఎస్ఐఎస్‌..?

Published on Dec 13 2015 // NRI

అమెరికాలోని స్కూళ్లను ఉగ్రవాదులు టా ర్గెట్ చేసినట్టు ఎఫ్‌బిఐ అధికారులు అంచనా వేస్తు న్నారు. కాలిఫోర్నియాలో పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికన్ జంట ఇటీవల కాల్పులకు తెగబడింది. అనంతరం భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు దాడుల్లో వారు హతమయ్యారు.

ఈ క్రమంలో, ఉగ్రవాది సయ్యద్ ఫరూక్ మొబైల్‌లో కార్టర్ హైస్కూలుకు చెందిన అనేక ఫోటోలను ఎఫ్‌బిఐ అధికారులు గుర్తించారు.

దీనితో, స్కూళ్లపై ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందన్న అనుమానంతో పలు విద్యాలయాల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ వివరాలను ‘సన్’ పత్రిక వెల్లడించింది.

ఇక షికాగో, టోరంటో, జెనీవాల వంతు
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల తాజా హెచ్చరికలు అమెరికా నగరం షికాగోతో పా టు కెనడా, స్విట్జర్లాండ్ నగరాలు టోరంటో, జెనీవాలను కూడా వణికిస్తున్నా యి.

ముప్పేట దాడులకు దిగుతామంటూ ఐఎస్ ఉగ్రవాదులు చేసి న హెచ్చ రికల నేపథ్యంలో ప్రస్తుతం జెనీవాలో భద్రత మునుపెన్నడూ లేనంత గా పెరి గింది. నగరంలోని అన్ని రోడ్లపై పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు అను మానిత వ్యక్తులను ప్రశ్నించి కాని వదలడం లేదు.

అం తేకాక పారిస్ దాడికి పాల్పడ్డ సలాహ్ అబ్దెస్లామ్ జెనీవా లో ఉన్నాడంటూ అమెరికా స్విట్జర్లాండ్ ప్రభుత్వాన్ని అ ప్రమత్తం చేయడంతో నగరంలో భద్రత పెరిగింది. సిరి యాలో శిక్షణ తీసుకుని వచ్చిన వారు షికాగో, టోరం టోలో దాడులకు యత్నిస్తున్నట్లు సమాచారం అందడం తో ఆ నగరాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఐఎస్ ఆదాయ మార్గాలను వెల్లడించిన యుఎస్ అధికారి
పలు దేశాల్లో దాడులు చేస్తున్న ఐఎస్ఐఎస్ ఆదాయ మార్గాలను యుఎస్ టెర్రరిజం, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అండర్ సెక్రటరీ అడమ్ జుబిన్ వెల్లడించారు. పలు బ్యాంకులను లూటీ చేసి బిలియన్ డాలర్లకు పైగా ఐఎస్ఐస్ సంపాదించిందని తెలిపారు.

నల్ల బజారులో చమురును అమ్మి ఆరు బిలియన్ డాలర్ల మేర ఆ సంస్థ కూడబెట్టిందని తెలిపారు. తమ అధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందని చెప్పారు. ప్రస్తుతం ఇలా ఐఎస్ఐస్ 1.5 బిలియన్ డాలర్లకు పైగా కూడబెట్టిందని చెప్పారు.

ఐఎస్ఐఎస్‌లో చేరమంటూ యువతను ప్రేరేపిస్తున్న ఐఒసి మేనేజర్ అరెస్ట్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) మార్కెటింగ్ మేనేజర్‌ను జైపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది.

ఇస్లామిక్ స్టేట్ తరఫున పని చేస్తూ, ఆన్‌లైన్లో, సామాజిక మాధ్యమాల ద్వారా ముస్లిం యువతను ఆకర్షించి, వారి మనసులను మార్చి, ఉగ్రవాదం వైపు నడిపించే కార్యకలాపాలు సాగిస్తున్నాడన్నది అతనిపై అభియోగం.

కర్నాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహమ్మద్ సిరాజుద్దీన్ 2014 ఏప్రిల్ 2014 నుంచి జైపూర్‌లో నివాసం ఉంటున్నాడు.

ఏటీఎస్ పోలీసుల కథనం ప్రకారం, సిరాజుద్దీన్ కార్యకలాపాలపై పూర్తి సాక్ష్యా లు ఉన్నాయి. ఆయన ఆన్‌లైన్ యాక్టివిటీని విశ్లేషించామని, వాట్స్ యాప్, ఫేస్ బుక్ తదితరాల ద్వారా యువతను చెడగొడుతున్నాడని రాజస్థాన్ ఏటీఎస్ విభా గం అడిషనల్ డీజీపీ అలోక్ త్రిపాఠి వెల్లడించారు.

తాను ఐఎస్ఐఎస్ కోసం ప ని చేస్తున్నట్టు ప్రాథమిక ఇంటరాగేషన్‌లో సిరాజుద్దీన్ అంగీకరించాడని, కేసు ను దర్యాప్తు చేస్తున్నామని, కోర్టు ముందుకు హాజరు పరుస్తామని తెలిపారు.

ఆయన ల్యాప్ టాప్‌లో ఐఎస్ఐఎస్ తన ప్రచారం నిమిత్తం మార్కెటింగ్ చేస్తున్న ‘దబీఖ్’ మ్యాగజైన్ సంచికలు ఎన్నో ఉన్నాయని అన్నారు.

ఐఎస్ ఫైనాన్స్ చీఫ్‌ను మట్టుబెట్టేశాం: అమెరికా ప్రకటన
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆర్థిక విభా గం అధిపతి (ఫైనాన్స్ చీఫ్) అబూ సలేహ్‌ను మట్టుబెట్టినట్లు అగ్ర రాజ్యం అమెరికా ప్రకటించింది.

గత నెలాఖరులో తాము జరిపిన వైమానిక దాడుల్లో అ బూ సలేహ్ చని పోయాడని, అతడితో పాటు అతడి ఇద్దరు అనుచరులు కూడా హతమయ్యారని ప్రక టించింది.

ఈ మేరకు గురువారం బాగ్దాద్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సందర్భంగా అమెరికా మిలిటరీ అధికార ప్రతినిధి కల్నల్ స్టీవ్ వారెన్ స్పష్టం చేశారు.

Leave a comment