Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసన

Published on Dec 12 2015 // NRI

తమ దేశానికి ముస్లింల వలసలను తాత్కా లికంగా నిషేధించాలంటూ రిపబ్లికన్‌ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై అమెరికా దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమ యింది.

ఈ వ్యాఖ్యలపై ఎన్‌బిసి, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంయు క్తంగా నిర్వహించిన సర్వేలో 57 శాతం మంది ఈ వ్యాఖ్యల ను తిరస్కరించారు. 25 శాతం మంది ట్రంప్‌ను సమర్ధిం చగా మరో 18 శాతం మంది తటస్థంగా వుండిపోయారు.

వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్‌ ఇటీవలి పారిస్‌, కాలిఫోర్నియా ఉగ్రవాద దాడులను దృష్టిలో వుంచుకుని ము స్లింల వలసలపై తాత్కాలిక నిషేధం విధించాలంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.

రిప బ్లికన్‌ పార్టీకి చెందిన ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు కన్పించాయి. 42 శాతం మంది ట్రంప్‌ను సమర్ధించగా 36 శాతం మంది వ్యతిరేకించారు. 22 శాతం మంది తటస్థంగా వుండిపోయారు. డెమొక్రాట్స్‌ లో 75 శాతం మంది ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించగా 11 శాతం మంది సమర్ధించారు.

కేవలం 14 శాతం మంది మా త్రం ఎటూ చెప్పలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. మొత్త మ్మీద 59 శాతం మంది అమెరికన్లు ముస్లింలపై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయగా 29 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు ఈ సర్వే తేల్చింది.

నల్లజాతి యువకుడి కాల్చివేతపై మేయర్‌ క్షమాపణ రాజీనామాకు డిమాండ్‌
గత ఏడాది పోలీసు కాల్పుల్లో నల్ల జాతి యువకుడు మరణించిన ఘటనపై చికాగో మేయర్‌ రామ్‌ ఎమ్మాన్యు యెల్‌ క్షమాపణ చెప్పినా అక్కడి ప్రజలు శాంతించటం లేదు.

మేయర్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది ప్రదర్శకులు చికాగో నగర వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

గురువారం ఉదయం ప్రదర్శకులు నగర టౌన్‌హాల్‌ ముందు 16 నిముషాలు బైఠాయించి ‘ఎవ రికీ హాని చెయ్యొద్ద’ని రాసిన ప్లకార్డులతో నిరసనప్రదర్శన నిర్వహించారు.

2014లో పోలీసు అధికారి జాసన్‌ వాన్‌డైక్‌ నల్లజాతి యువకుడు లక్వాన్‌ మెక్‌డొనాల్డ్‌ను 16 సార్లు కాల్చిన విషయాన్ని గుర్తు చేస్తూ వీరు 16 నిముషాలు నిరసన కొనసాగించారు.

సిటీ డౌన్‌టౌన్‌లో కొనసాగిన మరో ప్రదర్శనలో దాదాపు 500 మంది సిటీ హాల్‌ నుండి మిలీనియం పార్క్‌ వరకూ ర్యాలీ కొనసాగించారు.

మెక్‌ డొనాల్డ్‌ మృతి జరిగిన ఏడాది తరువాత కాల్పుల వీడియోను విడుదల చేసిన చికాగో ప్రభుత్వం వాన్‌డైక్‌పై హత్యా భియోగాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే

Leave a comment