Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

ఉగాది విజ‌యాల మూట‌..

Published on Apr 11 2013 // Featured News, News

తెలుగువారికి ఉగాది పర్వదినం .. కొత్తదనానికి శ్రీకారం అన్నమాట. ..ఒర‌కంగా కొత్త వత్సరానికి ప్రారంభం అన్నమాట. విజయాలను మూటగట్టి ఇచ్చే వత్సరంలోకి ఇప్పుడు అడుగుపెట్టాం.

ఇన్నాళ్లూ,శిశిరంలో స్తబ్దుగా ఉన్న పుడమి ఇప్పుడు భానుడి చురుకైన కిరణాలతో చైతన్యదీప్తితో వెలిగిపోయే వేళ. నిన్నమెున్నటివరకు వీడని చల్లదనం,.తొలగని పొగమంచుమబ్బులు ఇప్పుడు కన్పించవు.

స్తబ్దత పోరుయి చురుకుదనం వస్తుంది. ఆకులురాలి కళతప్పిన చెట్టూపుట్టా ఇప్పుడు లేలేత చిగుళ్ళతో కొత్తకళను తెస్తారు..

వసంతమాసం ప్రారంభమైందనడానికి సంకేతంగా కోకిలలు మధురగానాన్ని ఆలపిస్తూంటారు.

తెలతెలవారుతూంటే మావిచివుళ్లను తిన్న మత్తకోకిలలు గమ్మత్తుగా కుహూ…కుహూ…అంటూ మైమరవని హృదయం ఉండదు.

విరగబూసిన వేపపూత వెదజల్లే సువాసన ఆస్వాదిస్తూంటే కొత్తశక్తి పుట్టుకొస్తుంది. తెలుగునూతన వత్సరాది…ఉగాది. ఈ శుభవేళ ఉగాది ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం.

ఉగాది ప‌ర్వ‌దినం ప్ర‌త్యేక‌త‌..
యుగాది అన్న సంస్కృత పదానికి వికృతి రూపం ఉగాది. సృష్టి ఆరంభమైన మొదటి రోజు అని చెప్పుకోవచ్చు. బ్రహ్మదేవుడు కొత్త కల్పం ప్రారంభించిన రోజు ఉగాదిగా చెప్పుకోవచ్చు. మనం చాంద్రమానం అనుసరిస్తున్నాం. దాని ప్రకారమే పంచాంగం రూపొందిస్తాం. పండుగలనూ అనుసరిస్తాం.

చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ

ఈ శ్లోకం తాత్పర్యం తెలుసుకుందాం. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. ఆ వేళ ఈ సృష్టి ప్రారంభమైందని అర్థం. ప్రభవించిందని అర్థం. అందుకే తెలుగుసంవత్సరాలలో మొదటిది ప్రభవ.

చివరిది క్షయ. నాశనమైందని. అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్నమాట. అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. నిర్ణయసింధుకారుడుకూడా అదే చెప్పాడు. తత్ర చైత్రశుక్ర ప్రతిపదిసంవత్సరారంభ అన్నాడాయన.

ఉగస్య ఆదిః ఉగాదిః అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్కల ప్రకారం 432,00,00,000 సంవత్సరాలు. రాత్రికూడా అంతే. అంటే బ్రహ్మకు ఒకరోజు అంటే… 864,00,00,000 సంవత్సరాలన్నమాట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అంటే 3 లక్షల 11 వేల 40 కోట్ల సంవత్సరాలన్నమాట. ఇలా వందేళ్లు బ్రహ్మ ఆయుర్దాయం.

ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టికార్యాలు ముగించారు. ఏడవ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయపరార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలన్నమాట. కలియుగం ప్రమాది నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197,29,49,114 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం. ఇది ప్రారంభమై 5114 సంవత్సరాలైంది.

ఉగాదినాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అంటారు. మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజుకూడా ఇదేనని ప్రతీతి.
శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఉగాదే. వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాదినాడే.

ఉగాదినాడు..ఏంచేయాలి?
కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వేళ ఏం చేయాలో ధర్మసింధు, నిర్ణయ సింధు గ్రంథాలు చెబుతున్నాయి. ఈ శుభవేళ ఐదు పనులు చేయాలని అవి సూచించాయి. అవి..తైలాభ్యంగన స్నానం, స్తోత్రపారాయణ, ధ్వజారోహణం, ఉగాదిపచ్చడి సేవనం, పంచాంగశ్రవణం.

కొత్త ఏడాదికి స్వాగతం చెప్పాలంటే శుచి, శుభ్రత, చిత్తశుద్ధి, భక్తి అవసరం. బ్రాహ్మీ ముహుర్తంలో అంటే తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల మధ్య నువ్వులనూనె శరీరానికి మర్దనం చేసుకుని కుంకుడురసంతో తలంటి పోసుకోవాలి. కొత్తబట్టలు కట్టుకోవాలి. అంతకుముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి.

ముగ్గులు పెట్టుకోవాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. ఇష్టదేవతారాధన చేయాలి. ఈ పండుగకు అదే విశేషం. ఫలానా దేవుడ్ని పూజించాలన్న నిబంధనలేం లేవు.

ఎవరికి నమ్మకం ఉన్న దేవుడ్ని ఇవాళ ఆరాధించవచ్చు. కాలగమనానికి సంబంధించిన పండుగ కనుక, మనం చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం కనుక ఉగాది సాయంత్రం చంద్రుడికి నమస్కరించడం సత్సంప్రదాయం. ఇష్టమైన స్తోత్రాలను పఠించాలి.

విజయానికి సూచికగా తెల్లనివస్త్రంపై ఓంకారం రాసి ఇంటిపై జెండా ఎగురవేయాలి. కొన్నిదశాబ్దాలక్రితం వరకూ తెలుగునాట ఈ సంప్రదాయం ఉండేది. కాలక్రమేణా ఇది తగ్గిపోయింది.

జెండా ఎగురవేయడం విజయానికి సూచికగా భావిస్తారు. ఆ తరువాత ఉగాది పచ్చడి చేసుకుని ఇష్టదైవానికి ఆరగింపు పెట్టి పరగడపున తినాలి. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. జీవితంలో అన్ని రకాల పరిస్థితులకు ఇది సంకేతం.

బెల్లం(తీపి), చింతపండు (పులుపు), మిరియపు పొడి (కారం), వేపపువ్వు (చేదు) మామిడి ముక్కలు (వగరు), లవణం (ఉప్పు) తగు పాళ్లలో కలిపి పచ్చడి చేసుకుంటారు.

కాంలో మార్పుల కారణంగా మనుషులు అనేక అనారోగ్యాలకుగురవుతూంటారు. ఈ పచ్చడి తినడం వల్ల శ్లేష్మ, వాత, పిత్త రోగాలు రాకుండా ఉంటాయని విశ్వాసం. ఇక చివర్లో అంటే ఉగాది సాయంత్రం దేవాలయంలో లేదా పూజామందిరంలో పండితుల

జరిగే పంచాంగశ్రవణం కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. తిధి,వార,నక్షత్ర, యోగ, కరణ ఫలితాలను తెలుసుకోవడమే పంచాంగశ్రవణం. ఈ కొత్త సంవత్సర ఫలితాలను తెలుసుకోవాలి. ఈ సంప్రదాయాలన్నింటికి ఎంతో ప్రాముఖ్యత, ఫలితాలు ఉన్నాయని పండితులు చెబుతారు.

Leave a comment