Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

సెట్‌టాప్ బాక్స్‌ల‌పై ఎలాంటి తేడాలేదు. తివారీ

Published on Mar 31 2013 // Featured News, News

డిజిటలైజేషన్‌పై (సెట్‌టాప్ బాక్స్‌ల ఏర్పాటుపై) గడువు పొడిగించేంది లేదని కేంద్ర మంత్రి మనిష్ తివారీ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ గడువు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖ తనకు ఇంతవరకు అందలేదని చెప్పారు.

కాగా డిజిటలైజేషన్‌పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఉదయం కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్, విశాఖలలో కేబుల్ వినియోగదారులు ఇంకా సెట్‌టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోలేదని, గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు.

కేంద్రప్రభుత్వం కేబుల్ ప్రసారాలను డిజిటలైజేషన్ చేయాలని జీవో జారీచేస్తూ ఈనెల 31 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే.

సెట్‌టాప్ బాక్సులకోసం గ‌డువు పెంచాలి.

సెట్‌టాప్ బాక్సుల ధరలను ప్రభుత్వమే ఖరారు చేసి పేద మధ్య తరగతి ప్రజలపై భారంపడకుండా చూడాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కో కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఆదివారం ఆయన కవాడిగూడలో విలేకరులతో మాట్లాడుతూ, సెట్‌టాప్ బాక్సుల తయారీకి కేవలం ఐదారువందల రూపాయలు ఖర్చువుతుందని, కాని ప్రజలను 1100నుంచి 1500 రూపాయల వరుకు వసూలు చేస్తున్నారని అన్నారు.

సెట్‌టాప్ బాక్సుల పేరుతో జరుగుతున్న దోపిడిని ప్రభుత్వం కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఒక ధరను నిర్ణయించి తక్కువ ధరలకే పేద , మధ్య తరగతి ప్రజలకు సెట్‌టాప్‌బాక్సులు అందేలా చూడాలని ఆయన కోరారు.

ఉన్నఫలంగా కాకుండా సెట్‌టాప్‌బాక్సుల ఏర్పాటుకు మరో మూడు నెలలు గడువు ఇవ్వాలని గోవర్థన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a comment