Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

పిసిసి పీటం ఎవ‌రికి ద‌క్కేనో..!

Published on Mar 28 2013 // Featured News, Politics

ఇటీవల పంజాబ్‌ రాష్ట్రంలో పిసిసి పునర్వ్యవస్థీకరణ జరగడంతో రాష్ట్రంలో కూడా పిసిసి ప్రక్షాళనకు సంకేతమని పార్టిలోని కొంద‌రు సినియ‌ర్లు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో పలు మార్పులుంటాయని అంటున్నారు.

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పిన ఒక వ్యక్తి ఒకే పదవి అన్న సూత్రం ఆధారంగానే పంజాబ్‌లో పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్‌ అమరేంధర్‌ సింగ్‌ను తొలగించారు.

ఆయన స్థానంలో తొలిసారిగా ఎంపి అయిన ప్రతాప్‌సింగ్‌ భజ్వాను నియమించారు.

బొత్స స్థానంలో తెలంగాణ నేతను నియమిస్తారని, ఆప్రాంత నేతలు గట్టిగా నమ్ముతున్నారు. తెలంగాణ నేతను పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే ప్రాంతీయ అసమతుల్యత తొలగే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఉన్నతపదవులన్నీ సీమాంధ్రనాయకులే ఆక్రమించుకోవడం ద్వారా తెలంగాణకు పదవుల పంపకంలో తీవ్ర అన్యాయం జరిగిందనే భావన తీవ్రంగా ఉంది.

పిసిసి అధ్యక్ష పదవి ఉత్తరాంధ్రలోని విజయనగరానికి చెందిన బొత్స, రాయలసీమ చిత్తూరుకు చెందిన కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి, ఇదే ప్రాంతానికి చెందిన చక్రపాణి శాసనమండలి చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా గుంటూరుకు చెందిన నాదెండ్ల మనోహర్‌ ఉన్నత పదవులను అలంకరించారని తెలంగాణ ప్రాంత నాయకులు ఎప్పటినుంచి కినుకుగా ఉన్నారు.

దీనివల్ల ప్రాంతీయ అసమతుల్యత ఏర్పడిందని ఈ పొరపాటును సరిదిద్దాలని పదేపదే అధిష్టానానికి కూడా మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ప్రతిపాదనలతో వివిధ రాష్ట్రాలలో పార్టీని ప్రక్షాళన చేసేందుకు నడుంబిగించారు.

ఎన్నికలకు ముందుగానే రాష్ట్రంలో పీసీసీని ప్రక్షాళన చేసి ఆ పదవిని తెలంగాణ ప్రాంత నాయకుడికి కట్టపెట్టడం ద్వారా ఆ ప్రాంత నాయకులను, ప్రజలను సంతృప్తి పరచాలని అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలో బొత్స స్థానంలో వేరొకరిని నిలపాలని ముఖ్యమంత్రి కూడా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.

ఏప్రిల్‌ రెండవ వారంలో పీసీసీ ప్రక్షాళన జరగవచ్చునని అంటున్నారు.

ఈపదవికి మరో సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ కూడా ప్రయత్నిస్తున్నట్టు ఈ మేరకు ఇప్పటికే డిల్లిలో ముమ్మర లాబీయింగ్‌ నడుపుతున్నట్టు చెబుతున్నారు.

ఆయన గతంలో రెండుసార్లు పీసీసీ చీఫ్‌గా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.

ఈ విషయం ఆయనకు ప్లస్‌పాయింట్‌గా మారనున్నది. ఇటీవల దీనిపై డిఎస్‌ మాట్లాడుతూ అధిష్టానం తనను మరోసారి పిసిసి చీఫ్‌ పదవిని చేపట్టాలని ఆదేశిస్తే తప్పక శిరసా వహిస్తానని అన్నారు.

పిసిసి రేసులో ప్రధానంగా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ మల్లుభట్టి విక్రమార్క పేర్లు బలంగా వినిపించాయి. తాజాగా వీరికి తోడు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ పేరు కూడా రేసులో చేరింది.

రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ పదవి నుంచి గులాంనబీ ఆజాద్‌ కూడా వైదొలగే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. ఆజాద్‌ కూడా కేంద్రమంత్రి పదవిని త్యాగం చేసి పార్టీ కార్యక్రమాలకే అంకితమవ్వలని నిర్ణయించుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.

రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడిగా ఉండకపోవచ్చని ఆయన స్థానంలో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయసింగ్‌ రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించవచ్చని వినిపిస్తోంది.

Leave a comment