Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

కొడాలి నాని బాట‌లో వ‌ల్ల‌భ‌నేని..‌?

Published on Mar 28 2013 // Featured News, Politics

గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని దారిలోనే వల్లభనేని వంశీమోహన్‌ పయనించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విజయవాడ నడిరోడ్డుపై గతంలో జగన్‌ను అలింగనం చేసుకున్న ఘటనలో పార్టీ నుండి వంశీ షోకాజ్ నోటిసులు అందుకున్న విషయం తెలిసిందే.

జగన్‌ వాహనం దిగి కిందకు వచ్చినందుకే తాను ఆయన్ని కలుసుకున్నానని చెప్పి ఆ వివాదానికి వంశీ తాత్కాలికంగా తెరవేశారు. అంతలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని పార్టీని వీడి వైసీపీలో చేరడంతో, వంశీ కూడా పార్టీని వీడడం ఇక లాంఛనమేనని అప్పట్లో అంతా భావిం చారు.

వంశీ మాత్రం కార్యకర్తలు, పరిటాల యువసేన ఒత్తిడి మేరకు పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. గత రెండు రోజులుగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే వంశీ పార్టీని వీడడం ఖాయమనే ప్రచారం మరోసారి జోరందుకుంది.

అర్బన్‌ జిల్లా అధ్యక్ష పదవి నుండి తప్పించడం, రానున్న సాధరణ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం టికెట్‌ కేటాయింపుపై చంద్రబాబు స్పష్టమైన హామీనివ్వకపోవడంతో వంశీ తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు.

అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా తప్పించి రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శిగానియమిచినతీరు తనని అవమానించేదిగా ఉందని ఆయన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

తనకు పార్టీ పదవులేమి వద్దని, సాధారణ కార్య కర్తగానే కొనసాగుతానని వంశీ పేర్కొన్నట్లు సమాచారం. గన్న వరం టికెట్‌ ఇస్తానని గతంలో హామీ ఇచ్చిన బాబు, ఆ నియో జకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావుతో మాట్లాడించకపోవడాన్ని జీర్ణించు కోలే పోతున్నారన్నారు.

దాసరితో మాట్లాడించి ఉంటే తనకు నమ్మకం కుదిరి ఉండేదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పార్టీలో తనను పొమ్మనలేక పోగ బెట్టేందుకే అర్బన్‌ అధ్యక్షుడిగా తప్పించి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్య దర్శిగా నియమించారని తన సన్నిహితుల, ముఖ్య అనుచరుల సమా వేశంలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రానున్న ఎన్ని కల్లో గన్నవరం నియోజకవర్గం టికెట్‌ ఇవ్వకపోతే రాజకీయాల నుండి వైదొలిగి, వల్లభనేని అరుణమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నట్లు సమాచారం.

వంశీకి అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని వైసీపీలో చేరి ఇప్పటికే కృష్ణా జిల్లాలో కీలకనేతగా ఎదిగిన విష యం తెలిసిందే. ఆయన వంశీని వైసీపీలో చేరేలా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న వంశీని వైసీపీలో చేరాలని ఆయన మరింత ఒత్తిడి చేసే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీల కులు అంచనా వేస్తున్నారు.

వంశీ సైతం తాను టీడీపీలో కొన సాగిన గన్నవరం టికెట్‌ ఇస్తారనే నమ్మకం లేకపోవడంతో, వైసీపీ లో చేరి రానున్న ఎన్నికల్లో అక్కడి నుండి పోటీ చేయాలని భావిం చవచ్చునని పేర్కొంటున్నారు.

దీనికితోడు పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమాతో ఉన్న విభేదాలు వంశీ పార్టీని వీడేలా ఉసిగొల్పు తున్నాయని విశ్లేషిస్తున్నారు. వీటన్నింటికీతోడు పార్టీలో జూని యర్‌ ఎన్టీఆర్‌ మాట కూడా పెద్దగా చెల్లుబాటయ్యే అవకాశం లేకపోవడంతో టీడీపీని వీడేందుకు వంశీ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a comment