Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

చంద్ర‌బాబు యాత్ర 2500 కీమీ

Published on Mar 26 2013 // Featured News, Politics

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబ ‘వస్తున్నా.. .మీకోసం’ పేరిట చేపట్టిన పాదయాత్ర సోమవారం తూర్పు గోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గ కేంద్రంలో 2500 కిమీ మైలురాయి చేరుకుంది. పాదయాత్ర చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు. గతంలో ఎవరు కూడా ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. వైఎస్ ‘ప్రజాప్రస్థానం’ లో 1400కిమీ మాత్రమే పాదయాత్ర చేశారు.

షర్మిల మరోప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న బాబు దరిదాపుల్లో లేరు. బాబు ఎప్పుడో వైఎస్ రికార్డును తిరగరాసి మరింత ముందుకుసాగు తున్నారు. ప్రస్తుతం ఆయన 2500 కిమీ మైలురాయిని అధిగమించడం ద్వారా పాదయాత్ర చరిత్ర లో సరికొత్త చరిత్ర సృష్టించారు.

రైతులు, పేద ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 63 ఏళ్ల ముదిమి వయస్సులో గత ఏడాది అక్టోబర్ రెండవ తేదీన అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ పరిధిలోని సూగురు ఆంజనేయస్వామి దేవాలయం నుండి ‘వస్తున్నా.. మీకోసం’ పేరిట చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. గత 175 రోజులుగా అనారోగ్యాన్ని, గాయాలను సైతం లెక్క చేయకుండా ఆయన నిర్విరామంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

సభావేదిక కూలి రెండుసార్లు గాయపడిన మొక్కవోని ధైర్యంతో పాదయాత్ర చేపడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇప్పటికే 15 జిల్లాల పరిధిలోని 72 నియోజకవర్గాలను చంద్రబాబు చుట్టివేశారు. 143 మండలాలు, 24 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు పరిధి లోని 1118 గ్రామాల మీదుగా ఇప్పటికే ఆయన పాదయాత్ర కొనసాగింది.

రానున్న రోజుల్లో మరిన్ని జిల్లాలు, గ్రామాలు ఈ అలుపెరుగని పాదయాత్రికుని సాగిలాపడి స్వాగతం పలకను న్నాయి. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లార చూసి చలించిపోయిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతానని హామీనిస్తూ ముందుకు సాగుతున్నారు.

అనంతపురం జిల్లాలో పాదయాత్ర ప్రారంభించిన రెండవ రోజే రైతన్నల కడగండ్లు చూసి చలించిపోయిన బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ అమలు చేస్తానని ప్రకటించారు.

మహిళల రుణాలపై వడ్డీమాఫీ, బెల్ట్‌షాపుల రద్దు, వివిధ కులాల వృత్తుల వారికి ప్రత్యేక ప్యాకేజీలు, చేనేతలకు కార్పొరేషన్ వంటి హామీలను ప్రజలకు ఇచ్చారు. గిరిజనాభివృద్ధి కోసం పాదయాత్రలోనే డిక్లరేషన్ ప్రకటించారు. పేదల సంక్షేమం కోసం ఒకవైపు పాదయాత్ర కొనసాగిస్తూనే, మరోవైపు పార్టీ కార్యక్రమాలను సమీక్షించుకుంటూ ముందుకుసాగుతున్నారు.

పాదయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్‌లో సభావేదిక కూలి చంద్రబాబు వెన్నుముక గాయమయింది. వైద్యులు వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించి నప్పటికీ, ఆయన ఖాతరు చేయకుండా రెండవ రోజే తిరిగి పాదయాత్రను కొనసాగించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో బాబు పాదయాత్ర కొనసాగుతుండగానే ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మరో రెండు రోజులు పాటు పాదయాత్రకు విరామాన్ని ప్రకటించారు.

నీలం తుపాన్ బాధితులను పరామర్శించేందుకు ఒక రోజు పాదయాత్రకు బ్రెక్‌నిచ్చిన బాబు, తరువాత కాలి గాయాన్ని సైతం లెక్క చేయకుండా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో పాదయాత్ర పూర్తి చేశారు.

కాలి చిటికెన వేలు గాయం తీవ్రం కావడంతో కృష్ణా జిల్లా పరిటాల వద్ద వైద్యుల సూచనల మేరకు నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసు కున్నారు. కృష్ణా జిల్లాలో పాదయాత్ర ముగించుకుని గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేపట్టిన బాబు అలూరులో మరోసారి పెనుప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు.

ప్రజల నుద్దేశించి ప్రసంగించిన అనంతరం సభా వేదిక నుండి కింద కుదిగి వస్తుండగా తాత్కలిక మెట్లు కూలిపోవడంతో కింద పడిపోబోయిన బాబును, ఆయన అంగరక్ష కులు సకాలంలో స్పందించి కాపాడారు. పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదు రైన అధిగమిస్తూ లక్ష్యాన్ని చేరుకునేందుకు వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Leave a comment