Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

హైద‌రాబాద్‌లో వరుస బాంబుపేలుళ్లు

Published on Feb 21 2013 // Featured News, National, News

హైదరాబాద్‌పై టెర్రరిస్టులు ముందస్తు ప్రణాళికతో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో గల వెంకటాద్రి, కోణార్క్ సినిమా హాళ్ల సమీపంలో గురువారం సాయంత్రం శక్తిమంతమైన వరుస బాంబులు పేలాయి.

ఒక్కసారిగా ప్రజలంతా దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలంతా భయంతో ప‌రుగులు తీస్తుకనిపించారు.

ఈ ఘటనలో 22 మృతి చెంద‌గ, దాదాపు 25మందికి గాయాలయ్యాయని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది.
గురువారం సాయంత్రం రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్‌ నగరం ప్రాంతం వరుస పేలుళ్లతో దద్దరిల్లింది.
బాంబు పేలుడు సంభవించిన వెంటనే ప్రజలు హాహాకారాలు చేస్తూ అటు ఇటు పరుగులు తీయడంతో త్రొక్కిసలాట జరిగింది.

వెంకటాద్రి, కోణార్క్‌ థియేటర్ల ఎదురుగా ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. ఆనంద్‌ టిఫిన్‌ సెంటర్‌, ఫుటోవర్‌ బ్రిడ్జి వద్ద పేలుళ్ళు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు. సమీపంలోని తోపుడు బండిలో మిర్చి అమ్ముకునే ప్రాంతంలో కూడా పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

వెంకటాద్రి థియేటర్‌ వద్ద పేలని బాంబును కనుగొన్నరన్న వార్తలు నెప‌థ్యంలో ఈ పేలుళ్ళపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంబులెన్స్‌లు,ఆర్టిసి బ‌స్సుల్లో గాయపడిన వారిని ఉస్మానియాతో పాటు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. భారీ ఎత్తున పోలీస్‌ బలగాలు రంగంలోకి దిగాయి. డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌లను కూడా రప్పించి బాంబు పేలుళ్ల రెండు ప్రాంతాల్లో బాంబులు పెల్చిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.మోటార్ వాహ‌నాల‌కు బాంబులు అమ‌ర్చాఅనే కోణంలో ప‌రిశిలిస్తున్నారు.

నిత్యం రద్దీగా ఉండే దిల్‌షుఖ్‌నగర్‌ ప్రాంతం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. బాంబు పేలుళ్ళులో మృతుల శరీరాలు చెల్లాచెదురై ఆ ప్రాంతమంతా బీభత్సంగా తయారైంది.

ఒక్కసారిగా పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తిశారు. దీంతో తొక్కిసలాట జరగడంతో మరికొంతమంది గాయపడ్డారు. తొలుత కొద్ది సెకన్‌ల వ్యవధిలోనే రెండు పేలుడు శబ్దాలు వినిపించాయి. వెంటనే దట్టమైన నల్లని పోగలు వ్యాపించాయి.

ఏం జరుగుతుందో అర్థకానీ పరిస్థితులు నెలకొన్నాయి. బాంబు పేలుళ్ళవార్త తెలియగానే నగరమంతటా పోలీసులు హైఎలర్ట్‌ ప్రకటించారు. కీలకప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సాయంత్రం సుమారు 6:30 – 7:30గంటల మధ్య జరిగిన బాంబు పేలుళ్లతో భాగ్యనగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. గతంలో లుంబినీ పార్కు, సాయిబాబా టెంపుల్‌, గోకుల్‌ చాట్‌ బండారు వద్ద జరిగిన బాంబు పేలుళ్ళను గుర్తుకుతెచ్చుకుని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

2007లో ఇదే ప్రాంతంలో ఒక బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. గతంలో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటన స్మృతులను నేటీకి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు.

ఇంతలోనే నేడు బాంబులు పేలడం దాదాపు ఆరకిలోమీటర్‌ దూరం వరకు శబ్దాలు వినిపించడంతో ప్రజలు భీతావహులు అవుతున్నారు. ఇదమిద్దంగా ఎన్ని బాంబులు పేలాయన్న విషయమై ఖచ్చితమైన సమాచారం ఇంకా అందలేదు.

నిత్యం దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. పైగా సాయంత్రం వేళ ఈ ఘటన జరగడంతో ప్రజలతో మరింత రద్దీగా ఉంటుంది. కార్యాలయాల నుంచి, కాలేజీలనుంచి ఇళ్ళకు వెళ్ళేవారితో, చిరువ్యాపారులతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ దుర్ఘటన జరగడం ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది.

ల‌స్క‌రే ప్ర‌తి కార‌మా..!
ఇటీవల కాలంలో అజ్మల్‌ కసబ్‌, అఫ్జల్‌గురు ఉరితీతల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలు ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు జరిగినా దాంతో హైదరాబాద్‌కు లింకులు వెలుగుచూశాయి. ఈ దుర్ఘటన వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

అటువంటిది హైదరాబాద్‌ నగరంలోనే వరుస బాంబు పేలుళ్లు జరగడంతో అంతా దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇదిలా ఉండగా బాంబు పేలుళ్ళ సంఘటనపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

బాధితులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాలని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. కడపటి వార్తలు అందేసరికి గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Leave a comment