Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

కిర‌ణ్‌,బోత్స‌ల మ‌ధ్య కిరి..కిరి

Published on Feb 02 2013 // Featured News, Politics

రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య మరింత పెరుగుతోంది.

కిరణ్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బొత్స పనిచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో..

తాజాగా జగన్‌ పార్టీ వైపు వెళ్లిన 9 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బొత్స పెట్టిన పొగ పార్టీకి చుట్టుకుంది.

కిరణ్‌ను దెబ్బతీయాలనే ఎత్తుగడతోనే బొత్స వ్యూహాత్మకంగా 9 మందిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో ఒకసారి అధికారికంగా, మరొకసారి అనధికారికంగా మాట్లాడిన బొత్స ముఖ్యమంత్రి కిరణ్‌పై తన వ్యూహమేమిటన్నది చెప్పకనే చెప్పారు. 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మీడియాకు అడిగిన ఓ ప్రశ్నకు 9 మందిని మేం బహిష్కరించాం అని సమాధానం చెప్పారు.

నిజానికి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి 148 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ బొత్స చెప్పినట్లు 9 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తే కాంగ్రెస్‌ బలం 146కు పడిపోతుంది.

అప్పుడు ఒకవేళ విపక్షం అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోక తప్పదు. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఇన్ని ఈ కీలకమైన విషయం తెలియకపోవడం అనేది ఉండదని, బొత్స కావాలని, లౌక్యంగా మాట్లాడారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దానితోపాటు ‘కిరణ్‌ వచ్చిన తర్వాత 21 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇప్పుడు 9 మంది వెళ్లారు’ రాసుకోండని పిచ్చాపాటీగా మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రిపై బొత్స అంతరంగాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

బొత్స మాటల తీరు బట్టి.. కిరణ్‌ సర్కారు పడిపోవాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు.

9 మంది ఎమ్మెల్యేల బహిష్కరణ విషయం అసలు ముఖ్యమంత్రికి తెలియదని, సీఎంకు తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

పార్టీకి సంబంధించి, అందునా సర్కారు మైనారిటీలో ఉన్న సమయంలో ఇలాంటి కీలక ప్రకటన చేసేముందు ముఖ్యమంత్రితో చర్చించాలన్న విషయం బొత్సకు తెలియదా? అని నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి తనకు వ్యతిరేకంగా అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన వ్యవహారంలో కిరణ్‌ ఉన్నారని బొత్స అనుమానిస్తున్నారని, అందుకే దెబ్బకు దెబ్బ తీసేందుకు 9 మందిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి ఉంటారని పార్టీ నేతలు అసలు విషయం చెబుతున్నారు.

మాజీ మంత్రి శంకర్‌రావు అరెస్టుపైనా బొత్స తన అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరు బాధ, అభ్యంతరకరంగా ఉందని, తాను ఈ విషయాన్ని పార్టీపరంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాననడం వెనక.

శంకర్‌రావు వ్యవహారంలో కిరణ్‌ తప్పుచేశారన్న అర్ధం ధ్వనించింది. బొత్స తన ఇష్టాగోష్టిలో చేసిన వ్యాఖ్యలు కూడా కిరణ్‌పై ఆయనకు ఉన్న అసంతృప్తిని చ్పెపకనే చెప్పాయి.

9 మందిని బహిష్కరిస్తే మీ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది కదా అన్న మీడియా ప్రశ్నకు ‘ ఆ.. పడితే’ అని ఎదురు ప్రశ్నించి, అవిశ్వాసం కోరడం తమ బాధ్యతా? ఆ పనిచేయాల్సిన వారిని అడగండి’ వ్యాఖ్యానించారు.కిరణ్‌ వచ్చిన తర్వాత 21 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.

ఇప్పుడు 9 మంది అని నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు… కిరణ్‌ వల్లే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బయటకు వెళుతున్నారన్న భావన కనిపించింది.

ఇక తనపై ఇంద్రసేనారెడ్డి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన వైనం వెనుక కిరణ్‌ ఉన్నారన్న ఆగ్రహంతో బొత్స రగిలిపోతున్నట్లు కనిపిస్తోంది. ఆ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

‘నిన్న మంత్రి శంకర్‌రావు అరెస్టు వార్తను అన్ని న్యూస్‌ చానెళ్లు చూపిస్తే ఐ-న్యూస్‌ ఒక్కటి మాత్రం (అది కిరణ్‌కు సంబంధించిందన్న ఉద్దేశంతో) తనపై ఇంద్రసేనారెడ్డి చేసిన ఫిర్యాదునే ఎక్కువసార్లు చూపించిందని వ్యాఖ్యానించారు.

దీన్నిబట్టి కిరణ్‌-బొత్స మధ్య యుద్ధం ఏ స్థాయిలో ముదురుపాకాన పడిందో స్పష్టమవుతోంది.

ప్రధానంగా.. 9 మంది ఎమ్మెల్యేల బహిష్కరణకు సంబంధించిన ప్రకటన వెనుక కిరణ్‌ నేతృత్వంలోని కిరణ్‌ ప్రభుత్వం కూలిపోవాలన్నదే బొత్స అసలు అంతరంగమని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇప్పటికే ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటున్న నేపథ్యంలో బొత్స దానిని అధిగమించి, ఏకంగా కిరణ్‌ సారధ్యం వహిస్తోన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతే బాగుండునన్న ధోరణి ప్రదర్శిస్తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a comment