Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:54 am - బోఫోర్స్‌..ఆరోపణలు పరిశీలిస్తాం- సీబీఐ// 5:51 am - పెద్ద‌నోట్ల ర‌ద్దు మ‌ద్ద‌తుపై క్ష‌మించంది-క‌మ‌ల్‌// 5:01 am - అంగారకుడిపై జల ప్రవాహాలు// 4:52 am - నారా లోకేశ్‌ పీఏ పేరుతో పైరవీలు// 4:51 am - వైకాపా నేత కుమారుడి కిడ్నాప్‌కు యత్నం// 4:50 am - ఐఎస్‌ ఉగ్ర రాజధాని రక్కాకు విముక్తి..// 11:10 am - ఎఫ్‌-35 స్టెల్త్‌ రహస్యాల అపహరణ వెనుక డ్రాగన్‌// 10:53 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 10:45 am - ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌// 10:39 am - డేరా బాబాను జైలులో క‌లిసిన‌ భార్య// 5:18 am - ఎర్రమిర్చి. యవ్వారం// 3:28 am - నెల్లూరు,సీమ‌జిల్లాల్లో భారీ వర్షం// 3:23 am - ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్// 10:09 am - జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా..!// 10:01 am - MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు// 6:49 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 5:55 am - జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం// 5:34 am - వేడికి కార‌ణాలు క‌నుగోన్న శాస్త్ర‌వేత్త‌లు// 5:17 am - ఏపీలో 19 నుంచి మళ్లీ వర్షాలు?// 5:09 am - ఓదార్చిన రేణూ దేశాయ్//

రెండూ ప్రాంతాల్లో పార్టిని కాపాడుకునే దిశ‌గా కాంగ్రెస్‌

Published on Dec 30 2012 // Featured News, Politics

అఖిల‌సమావేశం అనంత‌రం కాంగ్రెస్ అనుస‌రిస్తున్న తీరు ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైయ్యాయి. తెలంగాణ ప్రాంతంత పాటు సీమాంద్ర ప్రాంతాలల్లో పార్టి ప‌రిస్థ‌తిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టి పెద్ద‌లు పావులు క‌దుపుతున్నారు.

అధిష్టానం ఆదేశాల మేర‌కు ఆయా ప్రాంతాల్లోని నాయ‌కులు మీడియా ముందు సంచ‌ల‌న మాట‌ల‌కు తెర‌లేపుతున్నారు.
రెండు రాష్ట్రాలకు కాంగ్రెస్‌ అనుకూలంగా ఉందని చెప్పడం కూడా వ్యూహంలో భాగమేనన్న అనుమానం కాంగ్రెస్‌, ఇతర పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రెండు ప్రాంతాల్లో పార్టీ దెబ్బతినకుండా ఉండేందుకే మునుపటి మాదిరిగా రెండు వాదనలు వినిపించిన కాంగ్రెస్‌ పార్టీ, ఈసారి యుపీఏ సాకుతో తప్పించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నెలరోజుల్లో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తా మన్న షిండే, తర్వాత కొన్ని గంటల్లోనే మాట మార్చడం వెనుక సోనియాగాంధీ ఆగ్రహం ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీలో చర్చించకుండా, యుపీఏ భాగస్వామ్యపక్షాలతో అభిప్రాయాలు తీసుకోకుండా నెలరోజుల గడువు ఎలా ప్రకటిస్తారని సోనియా ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాతనే షిండే ఆవిధంగా నెలరోజుల గడువు ప్రకటించలేదంటూ ప్రభుత్వ ప్రకటన వెలువడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలాఉండగా, కాంగ్రెస్‌ పార్టీ రెండు రాష్ట్రాల విధానానికి కట్టుబడి ఉందని చెప్పడం కూడా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నారు.

షిండే కూడా రెండు రాష్ట్రాల విధానమని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయమని చెప్పారే తప్ప, కేంద్రప్రభుత్వ నిర్ణయమని చెప్పకపోవడం గమనార్హం. దీన్ని బట్టి కాంగ్రెస్‌ తెలంగాణపై వ్యూహాత్మకంగానే వెళుతున్నట్లు స్పష్టమవుతోంది.

పార్టీ పరంగా తాము రెండు రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నప్పటికీ, కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాకుండా, సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోక తప్పదన్న ప్రకటన వెలువరించే ఎత్తుగడతో ఉన్నట్లు కనిపిస్తోంది.

దానికంటే ముందే భాగస్వామ్య పక్షాలతో ఒక సమావేశం ఏర్పాటుచేసి, తెలంగాణపై తన వ్యూహం అమలు చేసేలా కనిపిస్తోంది. యుపీఏ భాగస్వామ్యపక్షాల్లో ఒక్క అజిత్‌సింగ్‌ తప్ప ఎవరూ రాష్ట్ర విభజనకు అంగీకరించరు.

బయట నుంచి మద్దతునిస్తు, ప్రభుత్వం పడిపోకుండా పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరిస్తున్న సమాజ్‌వాదీపార్టీ వంటి పెద్ద పార్టీలు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ వంటి భాగస్వామ్యపార్టీలు రాష్ట్ర విభజనకు అంగీకరించే అవకాశాలు లేవు.

ఇన్ని కారణాల దృష్ట్యా తాము తెలంగాణ ఇవ్వలేకపోతున్నామని, 2014లో జరిగే ఎన్ని ల్లో తమ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే, రెండు రాష్ట్రాలు ఏర్పాటుచేస్తామని చెప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే, ఈలోగా తెలంగాణ అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో ఉన్న కేంద్రం, ప్రత్యేక అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేయాలన్న లక్ష్యంతో ఉందని ప్రకటించ నుంది.

ఆ మేరకు ఆ బోర్డుకు మునుపటి అభివృద్ధి మండలి మాదిరిగా కాకుండా పశ్చిమబెంగాల్‌లోని గూర్ఖాలాండ్‌ మాదిరిగా నిధులు ఖర్చు పెట్టుకునే అధికారం కూడా కల్పిస్తామని ప్రకటించనుంది.

దీనితోనే 2014 ఎన్నికల వరకూ బండి లాగించి, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది తామేనన్న ప్రచారంతో వెళ్లాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యంగా కనిపిస్తోంది.

అటు సీమాంధ్రలో తమ పార్టీ ఒక్కటే సమైక్యవాదంతో ఉందని, తెలుగుదేశం పార్టీ తెలం గాణకు ఉంటే, జగన్‌ పార్టీ కనీసం సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడలేదన్న సరికొత్త ప్రచారంతో రాజకీయ లబ్థిపొందే వ్యూహంతో వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే గాదె వెంకట రెడ్డితో సమైక్యాంధ్ర గురించి బలంగా మాట్లాడిం చారని చెబుతున్నారు.

దాని ద్వారా తెలంగాణలో పార్టీ దెబ్బతిన్నప్పటికీ సీమాంధ్రలో మాత్రం తానే సమైక్యవాద చాంపియన్‌గా నిలిచి, ఆ ప్రచారంతో టీడీపీ, వైకాపాను దెబ్బతీయాలన్నదే పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది.

Leave a comment